సామెతలు 16:1-33

  • యెహోవా ఉద్దేశాల్ని పరిశీలిస్తాడు (2)

  • నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు (3)

  • న్యాయమైన త్రాసు యెహోవాది (11)

  • నాశనానికి ముందు గర్వం ఉంటుంది (18)

  • తలనెరపు అందమైన కిరీటం (31)

16  మనిషి తన హృదయంలోని ​ఆలోచనల్ని సిద్ధం చేసుకుంటాడు,అయితే అతనిచ్చే* జవాబు యెహోవా నుండి వస్తుంది.+   మనిషికి తన మార్గాలన్నీ సరైనవిగా* కనిపిస్తాయి,+అయితే యెహోవా ఉద్దేశాల్ని* పరిశీలిస్తాడు.+   నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు,+అప్పుడు నీ ఆలోచనలు సఫలమౌతాయి.   యెహోవా ప్రతీది తన సంకల్పం కోసం తయారుచేశాడు,చివరికి దుష్టుణ్ణి కూడా విపత్తు రోజు కోసం చేశాడు.+   గర్వహృదయులు యెహోవాకు అసహ్యం.+ వాళ్లు తప్పకుండా శిక్షించబడతారనే నమ్మకంతో ఉండు.   విశ్వసనీయ ప్రేమ వల్ల, నమ్మకత్వం వల్ల దోషం క్షమించబడుతుంది,*+యెహోవాకు భయపడడం వల్ల ఒక వ్యక్తి చెడు నుండి దూరంగా వెళ్తాడు.+   ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు సంతోషం కలిగిస్తే,అతని శత్రువులు కూడా అతనితో శాంతిగా ఉండేలా చేస్తాడు.+   అన్యాయంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కన్నా+నీతిగా ఉంటూ కొంచెం సంపాదించడం మంచిది.+   మనిషి తాను వెళ్లాల్సిన దారి గురించి హృదయంలో ఆలోచించుకుంటాడు,అయితే యెహోవా అతని అడుగుల్ని ​నిర్దేశిస్తాడు.+ 10  రాజు పెదాల మీద దేవుని* నిర్ణయం ఉండాలి,+అతను ఎన్నడూ న్యాయం తప్పకూడదు.+ 11  న్యాయమైన తక్కెడ, న్యాయమైన త్రాసు యెహోవావే;సంచిలోని తూకం రాళ్లన్నీ ఆయన ​చేసినవే.+ 12  చెడ్డపనులు చేయడం రాజులకు అసహ్యం,+నీతి వల్ల సింహాసనం స్థిరపడుతుంది.+ 13  నీతిగల మాటలు రాజులకు సంతోషం కలిగిస్తాయి. నిజాయితీగా మాట్లాడేవాళ్లంటే వాళ్లకు చాలా ఇష్టం.+ 14  రాజు కోపం మరణదూత లాంటిది,+తెలివిగలవాడు ఆ కోపాన్ని చల్లారుస్తాడు.*+ 15  రాజు ముఖకాంతిలో జీవం ఉంటుంది;అతని అనుగ్రహం వసంత కాలంలోని వానమబ్బు లాంటిది.+ 16  బంగారం సంపాదించడం కన్నా తెలివిని సంపాదించడం ఎంత మంచిది!+ వెండిని సంపాదించడం కన్నా అవగాహనను ఎంచుకోవడం మేలు.+ 17  నిజాయితీపరుల రహదారి చెడుకు దూరంగా ఉంటుంది. తన మార్గాన్ని జాగ్రత్తగా కాపాడుకునే​వాడు తన ప్రాణాన్ని కాపాడు​కుంటాడు.+ 18  నాశనానికి ముందు గర్వం ఉంటుంది,పడిపోవడానికి ముందు అహంకార స్వభావం ఉంటుంది.+ 19  అహంకారుల దోపుడుసొమ్ము పంచుకోవడం కన్నాసాత్వికుల మధ్య వినయంగా ఉండడం మంచిది.+ 20  ఒక విషయం మీద లోతైన అవగాహన ఉన్నవాడు విజయం సాధిస్తాడు,*యెహోవాను నమ్ముకున్న వ్యక్తి ​సంతోషంగా ఉంటాడు. 21  తెలివిగల హృదయం ఉన్నవాళ్లు ​అవగాహన గలవాళ్లని ​పిలవబడతారు,+దయగా* మాట్లాడేవాళ్ల దగ్గర ఒప్పించే సామర్థ్యం ఉంటుంది.+ 22  లోతైన అవగాహన ఉన్నవాళ్లకు ఆ ​అవగాహనే జీవపు ఊట,అయితే తెలివితక్కువవాళ్లు తమ ​తెలివితక్కువతనంతోనే క్రమశిక్షణ ​పొందుతారు. 23  తెలివిగలవాళ్ల హృదయం వాళ్ల నోటికి లోతైన అవగాహనను,+వాళ్ల మాటలకు ఒప్పించే సామర్థ్యాన్ని ఇస్తుంది. 24  మనోహరమైన మాటలు తేనెపట్టు లాంటివి,అవి ప్రాణానికి* తియ్యగా ఉంటాయి, ఎముకలకు ఆరోగ్యాన్నిస్తాయి.+ 25  ఒక మార్గం మనిషికి సరైనదిగా ​కనిపిస్తుంది,కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+ 26  శ్రమించేవాడి ఆకలి అతను కష్టపడి పనిచేసేలా చేస్తుంది,అతని నోరు అతన్ని తొందరపెడుతూ ఉంటుంది.+ 27  పనికిమాలినవాడు చెడును తవ్వి ​పైకితీస్తాడు;+అతని మాటలు మండే అగ్ని లాంటివి.+ 28  సమస్యలు సృష్టించేవాడు* విభేదాలు పుట్టిస్తాడు,+లేనిపోనివి కల్పించి చెప్పేవాడు ప్రాణ స్నేహితుల్ని విడదీస్తాడు.+ 29  దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి ప్రలోభపెట్టిఅతన్ని తప్పుదారిలో నడిపిస్తాడు. 30  అతను కన్ను గీటుతూ హానిచేయడానికి కుట్ర పన్నుతాడు. తన పెదాలు బిగబట్టి కీడు చేస్తాడు. 31  నీతి మార్గంలో నడిచేవాళ్లకు వచ్చే ​తలనెరపు+వాళ్లకు అందమైన* కిరీటం.+ 32  కోప్పడే విషయంలో నిదానించేవాడు+ బలశాలి కన్నా బలవంతుడు,తన కోపాన్ని* అదుపు చేసుకునేవాడు నగరాన్ని జయించేవాడి కన్నా ​శక్తిమంతుడు.+ 33  చీటి* ఒడిలో వేయబడుతుంది,+అయితే దానితో తీసుకునే ప్రతీ నిర్ణయం యెహోవా నుండే వస్తుంది.+

అధస్సూచీలు

లేదా “సరైన.” అక్ష., “నాలుక ఇచ్చే.”
అక్ష., “స్వచ్ఛమైనవిగా.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “పరిహరించబడుతుంది.”
లేదా “ప్రేరేపిత.”
లేదా “ఆ కోపానికి దూరంగా ఉంటాడు.”
అక్ష., “మేలు పొందుతాడు.”
లేదా “ఆకట్టుకునేలా.”
లేదా “నోటికి.” పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “పన్నాగాలు పన్నేవాడు.”
లేదా “మహిమగల.”
లేదా “మనసును.”
పదకోశం చూడండి.