పాట 49

యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

(సామెతలు 27:11)

  1. 1. ‘దేవా, చేస్తాము నీ చిత్తం’

    అని మాటిచ్చాము మేము.

    నిన్ను ఆనందపెట్టడం,

    మాకు ఓ గొప్ప వరము.

  2. 2. నీ దాసుడు ఈ భూమిపై

    నీ కీర్తి చాటుతున్నాడు.

    యుక్తావేళాహారమిచ్చి,

    మాకు బలాన్నిస్తున్నాడు.

  3. 3. నమ్మకముగా ఉండేలా

    పవిత్రశక్తిని ఇవ్వు.

    నిన్ను సంతోషపెడతాం,

    నీ కీర్తికై శ్రమిస్తాము.

(మత్త. 24:45-47; లూకా 11:13; 22:42 కూడా చూడండి.)