‘నాకు లభించిన శిక్షణనుబట్టి సంతోషిస్తున్నాను’

‘నాకు లభించిన శిక్షణనుబట్టి సంతోషిస్తున్నాను’

‘నాకు లభించిన శిక్షణనుబట్టి సంతోషిస్తున్నాను’

యౌవనస్థురాలైన కాజునా వాళ్ల టీచరు ఆమెను ఆంగ్ల ఉపన్యాస పోటీలో పాల్గొనమన్నప్పుడు ఆమె నివ్వెరపోయింది. ఈ పోటీలో, జపాన్‌కు చెందిన పెద్ద ఉత్తర ద్వీపమైన హొక్కాయిడోలోని ఉన్నత పాఠశాలలన్నీ పాల్గొనవచ్చు, కానీ ఆమె పాఠశాల తరఫున అంతకు ముందు ఏ విద్యార్థి ఆ పోటీలో పాల్గొనలేదు. ఆ పోటీ రోజున కాజునా ఎంతో భయపడింది, ఎందుకంటే ఆ పోటీలో దాదాపు 50 మంది విద్యార్థులు పాల్గొనబోతున్నారు. జడ్జీలుగా ఉన్నవారిలో ఇద్దరి మాతృభాష ఆంగ్లమని గమనించినప్పుడు ఆమె మరింత భయపడిపోయింది.

చివరి బహుమతి గెలుచుకున్న విజేతతో మొదలుపెట్టి విజేతల పేర్లు ప్రకటించడం ప్రారంభమైంది. ఆఖరున కాజునా పేరు పిలిచినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఆమె, ఆమె ప్రక్కనే కూర్చొనివున్న ఆమె టీచర్‌ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆ షాక్‌ నుండి పూర్తిగా తేరుకోకుండానే కాజునా స్టేజి మీదికి వెళ్లి మొదటి బహుమతిగా తన ట్రోఫీని అందుకుంది!

“యెహోవా సంస్థ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా అందజేస్తున్న శిక్షణ వల్లనే ఇది సాధ్యమైంది. నేను ఈ శిక్షణ పొందగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అని కాజునా సంతోషంగా వివరించింది. కాజునా తన చిన్నతనం నుండి భాగం వహించిన ఆ దైవపరిపాలనా పాఠశాల, యెహోవాసాక్షుల సంఘ కూటాలలో ఒకటి. కాజునా ఆ పోటీకి సిద్ధపడుతున్నప్పుడు, మైక్‌ ఉపయోగించడం, ఆప్యాయంగా ఉత్సాహంగా మాట్లాడడం, ముఖకవళికలు మార్చడం, ప్రేక్షకులను చూస్తూ ప్రసంగించడం వంటివాటికే కాక దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో బోధించబడే ఇంకా ఇతర అంశాలకు ప్రత్యేక అవధానమిచ్చింది.

యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలో ప్రతీవారం నిర్వహించబడుతున్న ఈ పాఠశాలను పరిశీలించడానికి రమ్మని మేమిస్తున్న ఆహ్వానాన్ని దయచేసి అంగీకరించండి. పెద్దలు పిన్నలు ఒకే విధంగా ఎలా ప్రయోజనం పొందుతున్నారో స్వయంగా వచ్చి చూడండి. ఈ కూటానికి అందరూ రావచ్చు. మీ ఇంటికి సమీపంలోవున్న ఈ పాఠశాలకు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే, మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులను దయచేసి సంప్రదించండి.