తేజరిల్లు! నం. 1 2025 | ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?
భగ్గుమంటున్న ధరలు మిమ్మల్ని బెంబేలెత్తిస్తున్నాయా? రోజంతా రెక్కలు-ముక్కలు చేసుకుంటే గానీ మీకు ఇల్లు గడవట్లేదా? మీ ఇంట్లోవాళ్లతో నాలుగు మాటలు మాట్లాడాలన్నా తీరిక ఉండట్లేదా? అలాగైతే, ఈ తేజరిల్లు! పత్రిక మీ కోసమే. మీ టెన్షన్స్‌ని తగ్గించుకోవడానికి, సంతోషాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే సలహాలు ఇందులో ఉన్నాయి. అలాగే, భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ఈ పత్రిక మీలో నింపుతుంది. ఇప్పుడున్న కష్టాల మధ్య కూడా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది.
చేదు నిజాన్ని జీర్ణించుకోండి
పెరిగే రేట్లను ఆపలేమని గుర్తించడం వల్ల మీ పరిస్థితిని మార్చుకుని మీకు మీరు మేలు చేసుకుంటారు.
డబ్బును తెలివిగా ఖర్చు పెట్టండి
డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి ఉపయోగపడే ఐదు చిట్కాల గురించి తెలుసుకోండి.
ఉన్నంతలో తృప్తిగా జీవించండి
ఉన్నంతలో సర్దుకుపోతూనే సంతోషంగా ఎలా ఉండవచ్చో తెలుసుకోండి.
ఇచ్చే గుణం చూపించండి
డబ్బు సమస్యల్ని తట్టుకోవడానికి ఇచ్చే గుణం ఎలా సహాయం చేస్తుంది?
ఆశతో ఉండండి
భవిష్యత్తు నిజంగా బాగుంటుందనే ఆశను బైబిలు మనలో నింపుతుంది. అదేంటో తెలుసుకుంటే, ఇప్పుడున్న కష్టాల్ని కూడా తట్టుకోవచ్చు.
ఎక్కువ తెలుసుకోండి
రేట్లు పెరిగిపోతున్నా నెట్టుకురావడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేస్తుంది. అది మీకు కూడా సహాయం చేయగలదు.

