కావలికోట నం. 1 2025 | యుద్ధాలు లేని ప్రపంచం​—చూస్తామా?

యుద్ధాలు లేదా దాడులు జరగని లోకంలో జీవించాలని మీరు కల కంటున్నారా? చాలామందికి ఆ కల నిజమైతే బాగుండని అనిపిస్తుంది. కానీ, అది పగటి కలగానే మిగిలిపోతుందని వాళ్లు అనుకుంటారు. అయితే, మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధాల్ని ఎందుకు ఆపలేకపోతున్నారో బైబిలు చెప్తుంది. అంతేకాదు, ప్రపంచమంతా శాంతిగా ఉండే రోజు నిజంగా వస్తుందని, దాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చని కూడా బైబిలు చెప్తుంది.

ఈ పత్రికలో ఉపయోగించిన “యుద్ధం” లేదా “దాడి” అనే పదాలు రాజకీయ గుంపులు లేదా దేశాల మధ్య ఆయుధాలతో జరిగే పోరును సూచిస్తున్నాయి. ఇందులో చెప్పిన వ్యక్తుల పేర్లలో కొన్ని మార్చాం.

 

గుండెల్లో గుబులు పుట్టిస్తున్న యుద్ధాలు

యుద్ధాల్ని స్వయంగా చూసిన సైనికులు, సామాన్య ప్రజలే అవి మిగిల్చిన గాయాల గురించి చెప్పగలుగుతారు.

యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల

యుద్ధాలు-దాడులు అంటే వినాశనం, విధ్వంసం, తీరని నష్టం. దానికి కొన్ని ఉదాహరణలు చూడండి.

యుద్ధాలకు, దాడులకు మనం ముగింపు పలకగలమా?

పోరాటాల్ని, గొడవల్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?

యుద్ధాలు, దాడులు జరగడానికి కారణాలేంటో బైబిలు చెప్తుంది.

యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?

దేవుని రాజ్యం యుద్ధాలకు తెరదించి, భూమ్మీదకు నిజమైన శాంతిని తీసుకొస్తుంది.

యుద్ధాలు, దాడులు జరుగుతున్నా ప్రశాంతంగా ఉండవచ్చు

యుద్ధం వల్ల నష్టపోయిన వాళ్లకు బైబిల్లో ఉన్న విషయాలు ఇప్పుడు సహాయం చేస్తున్నాయి.

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

యుద్ధాలే లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? ఈ ప్రశ్నకు అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబు తెలుసుకుంటే మీరు మనశ్శాంతి పొందుతారు.