సువార్త పుస్తకాల్లో యేసు కథ

అద్భుతంగా తెరకెక్కించిన ఈ వీడియో సిరీస్‌లో దేవుని కుమారుడూ, లోక రక్షకుడూ అయిన యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోండి.

సువార్త పుస్తకాల్లో యేసు కథ సిరీస్‌కు పరిచయం

యేసుక్రీస్తు గురించిన ఈ అద్భుతమైన వీడియో సిరీస్‌లో, సువార్త పుస్తకాలు జీవం పోసుకోవడాన్ని చూడండి.

ఎపిసోడ్‌ 1

లోకానికి నిజమైన వెలుగు

యోసేపు మరియలకు యేసును పెంచే గొప్ప భాగ్యం దొరికింది. ఆ పిల్లాడు అందరిలా కాదు.

ఎపిసోడ్‌ 2

‘ఈయన నా కుమారుడు’

మెస్సీయ రాక గురించి బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించాడు. యేసు భూమ్మీద పరిచర్య మొదలుపెట్టాడు.

ఎపిసోడ్‌ 3

“నేనే ఆయన్ని”

యేసు నీకొదేముకు, సమరయ స్త్రీకి, నజరేతు ఊరివాళ్లకు బోధించాడు. వాళ్లలో కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు.

ఎపిసోడ్‌ 4

“అందుకే కదా నేను వచ్చాను”

యేసు రోగుల్ని బాగుచేశాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు, శిష్యుల్ని చేశాడు, 12 మంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు.

ఎపిసోడ్‌ 5

“ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు”

చాలామందిని బాగుచేశాక, యేసు కొండమీది ప్రసంగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగం తెలియనివాళ్లే ఉండరేమో.

ఎపిసోడ్‌ 6

“రాబోతున్న వ్యక్తివి నువ్వేనా?”

యేసు ఒక విధవరాలి కొడుకును బ్రతికించాడు, సింపుల్‌ ఉదాహరణలు చెప్పాడు, వినేవాళ్ల ఉద్దేశాల్ని బయటపెట్టాడు.

సువార్త పుస్తకాల్లో యేసు కథ—వీడియో సిరీస్‌ ట్రైలర్‌

సువార్త పుస్తకాలకు జీవం పోసే ఈ అద్భుతమైన సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ చూడండి.