ప్రపంచ వార్తలు

విక్టర్‌ స్టాషేవ్‌స్కీ 2021, మార్చి నుండి క్రిమియా జైల్లో ఉన్నాడు

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

2026, ఏప్రిల్‌ కల్లా ప్రపంచవ్యాప్తంగా 279 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు, తమ విశ్వాసం కారణంగా జైల్లో వేయబడ్డారు.

ఇంటర్నేషనల్‌ కవనెంట్‌ ఆన్‌ సివిల్‌ అండ్‌ పొలిటికల్‌ రైట్స్‌లోని ఆర్టికల్‌ 18 ప్రకారం ప్రతీ ఒక్కరు తమ ఆలోచన, మనస్సాక్షి, అలాగే మతానికి సంబంధించి స్వేచ్ఛ కలిగి ఉండే హక్కు ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో, యెహోవాసాక్షులకు ఆ హక్కు లేకుండా చేస్తున్నారు. వాళ్లు తమ విశ్వాసానికి తగ్గట్టు జీవిస్తున్నందుకు, మనస్సాక్షి కారణంగా మిలిటరీలో చేరనందుకు అన్యాయంగా జైల్లో వేస్తున్నారు, వాళ్లను క్రూరంగా హింసిస్తున్నారు.

“చెరసాలలో ఉన్నవాళ్లను గుర్తుచేసుకోండి. మీరు కూడా వాళ్లతోపాటు చెరసాలలో ఉన్నట్టు భావిస్తూ వాళ్లను గుర్తుచేసుకోండి.”—హెబ్రీయులు 13:3.