కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...

ఒకరి సమృద్ధి వేరేవాళ్ల అవసరాల్ని తీరుస్తుంది

ఒకరి సమృద్ధి వేరేవాళ్ల అవసరాల్ని తీరుస్తుంది

అక్టోబరు 1, 2020

 యెహోవాసాక్షులు 200 కన్నా ఎక్కువ దేశాల్లో ప్రజలకు సహాయం చేయడానికి ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తుంటారు. అయితే కేవలం 35 దేశాల్లోనే స్థానికంగా వచ్చే విరాళాలు ఆ దేశాల ఖర్చులకు సరిపోతాయి. మరి పేద దేశాల ఖర్చులు ఎలా తీరతాయి?

 యెహోవాను ఆరాధించడానికి, మంచివార్తను ప్రకటించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు ఏమేం అవసరమో పరిపాలక సభ చూసుకుంటుంది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఆలోచించి దాన్నిబట్టి విరాళాల్ని ఉపయోగిస్తారు. ఏదైనా ఒక బ్రాంచికి స్థానిక పనుల కోసం ఎక్కువ విరాళాలు వస్తే, మిగిలిపోయిన విరాళాలను అవసరంలో ఉన్న దేశాలకు పంపిస్తారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా అలానే ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్లు. దాంతో ‘వాళ్ల భారాలు సమానం అయ్యేవి.’ (2 కొరింథీయులు 8:14) తమ దగ్గరున్న సమృద్ధిని అవసరంలో ఉన్న క్రైస్తవులకు ఇస్తూ వాళ్లకు సహాయం చేసేవాళ్లు.

 వేరే దేశాల నుండి విరాళాలు పొందుతున్న సహోదరులు ఏమంటున్నారు? ఉదాహరణకు టాంజానియాలో ఎక్కువశాతం మంది రోజుకు 150 రూపాయలకంటే తక్కువ జీతంతోనే సర్దుకుపోతున్నారు. అయితే వేరే దేశాల నుండి వచ్చిన విరాళాల సహాయంతో అక్కడున్న మఫింగా సంఘం ఉపయోగించే రాజ్యమందిరానికి మరమ్మతులు చేయగలిగారు. ఆ సంఘంలోని సహోదర సహోదరీలు ఇలా రాశారు: “మరమ్మతులు జరిగినప్పటినుండి మీటింగ్స్‌కి చాలామంది హాజరౌతున్నారు. విస్తారంగా ఇస్తున్న యెహోవా సంస్థకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదర సహోదరీలకు మేము ఎంతో కృతజ్ఞులం. వాళ్లు అలా ఉదారంగా ఇచ్చినందుకే మేము ఇలాంటి అందమైన చోట యెహోవాను ఆరాధించగలుగుతున్నాం.”

 కరోనావల్ల ఆహారకొరతలు ఏర్పడినప్పుడు శ్రీలంకాలోని మన సహోదరుల్లో కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇమారా ఫర్నెండో, ఆమె అబ్బాయి ఈనోష్‌ కూడా అలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొన్నారు. కాని వేరే దేశాల నుండి వచ్చిన విరాళాల సహాయంతో వాళ్ల అవసరాలు తీరాయి. వాళ్లు ఒక కార్డు తయారుచేసి దాంట్లో ఇలా రాశారు: “ఈ కష్టమైన పరిస్థితుల్లో మామీద ప్రేమ చూపించిన సహోదరులకు చాలా థ్యాంక్స్‌. ఈ కుటుంబంలో భాగంగా ఉన్నందుకు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఈ చివరిరోజుల్లో మన సహోదరులందరికీ యెహోవా సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం.”

ఇమారా, ఈనోష్‌ ఫర్నెండో

 మన సహోదర సహోదరీలు ఎక్కడ జీవించినా తమకున్న వాటిని ఇతరులకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణకు ఈనోష్‌ అవసరంలో ఉన్నవాళ్లకు విరాళాలిస్తూ సహాయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ఒక చిన్న బాక్సు తయారుచేసి దానిలో డబ్బులు దాచిపెడుతున్నాడు. మెక్సికోలో ఉంటున్న గ్వాడలుపా అల్వరేజ్‌ అనే సహోదరి కూడా విస్తారంగా ఇస్తుంది. ఆమె ఉంటున్న ప్రాంతంలో చాలా తక్కువమందికి జీతాలు వస్తాయి. ఒకవేళ వచ్చినా అది చాలా తక్కువ మొత్తం. అయినా ఆమె ఇవ్వగలిగినదంతా ఇస్తుంది. ఆమె ఇలా రాస్తుంది: “యెహోవా చూపించిన మంచితనానికి ఆయన విశ్వసనీయ ప్రేమకు నేను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఇచ్చే విరాళాలు, ఇతర సహోదర సహోదరీలు ఇచ్చే విరాళాలు కలిపినప్పుడు అవసరంలో ఉన్న నా సహోదరులకు అవి ఉపయోగపడతాయని నాకు తెలుసు.”

 వేరే ప్రాంతాలకు విరాళాలు పంపించే బ్రాంచి కార్యాలయాలు ఆ పనిని ఎంతో సంతోషంగా చేస్తున్నాయి. బ్రెజిల్‌ బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్న సహోదరుడు ఆంథోనీ కర్వాలూ ఇలా అంటున్నాడు: “ఎన్నో సంవత్సరాలు మా దేశంలోని పనులు, ఇతర దేశాలు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే ముందుకు వెళ్లాయి. దానివల్ల మా క్షేత్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి మెరుగైంది కాబట్టి, ఇతరులకు సహాయం చేసే అవకాశం మాకు ఉంది. ఇప్పుడు బ్రెజిల్‌లో ఉన్న సహోదరులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని గురించి ఆలోచిస్తూ విరాళాలు ఇస్తున్నారు.”

 అయితే అవసరంలో ఉన్న తమ సహోదర సహోదరీలకు యెహోవాసాక్షులు ఏవిధంగా సహాయం చేయవచ్చు? నేరుగా వేరే దేశాల్లోని బ్రాంచి కార్యాలయాలకు డబ్బులు పంపించకూడదు. బదులుగా ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు ఇవ్వడం ద్వారా సహాయం చేయవచ్చు. దానికోసం సంఘాల్లో “ప్రపంచవ్యాప్త పని” అని రాసి ఉన్న విరాళాల పెట్టెలో మీరు విరాళాలు వేయవచ్చు, లేదా donate.jw.org ద్వారా కూడా విరాళాలు ఇవ్వవచ్చు. మీరిచ్చే విరాళాలన్నిటినీ మేము ఎంతో విలువైనదిగా ఎంచుతాం.