కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 99

వేవేల ఈ ఐక్య బృందం

వేవేల ఈ ఐక్య బృందం

(ప్రకటన 7:9, 10)

  1. 1. వేవేల ఈ ఐక్య బృందం

    జట్టుగా నించున్నాం

    నలుదిక్కుల నుండి

    వచ్చిన సాక్షులం

    పొంగిన సంద్రమల్లే

    పోగయ్యామందరం

    దేవుని పర్వతంపై

    చేరి స్తుతిద్దామాయన్ని.

  2. 2. వేవేల ఈ ఐక్య బృందం

    జతగా సాగుతాం

    ప్రజల్లో కాంతినింపే

    వార్తని మోస్తున్నాం

    దూరతీరాలు చేరి

    కబురునందిస్తాం

    యేసు ఇచ్చే సహకారంతో

    తేలికే ఈ పని.

  3. 3. వేవేల ఈ ఐక్య బృందం

    ఎంతెంతో ధన్యులం

    పరదైసు భూమిపై

    చోటు సంపాందించాం

    తండ్రి కళ్లముందుంటూ

    సేవచేద్దాం రోజూ

    ఇంతకంటే గొప్ప గౌరవం

    భూమ్మీద లేదంటూ.