పాట 93
దేవా, మా కూటాలను దీవించు
-
1. ప్రార్థిస్తున్నాము యెహోవా,
ఈ కూటాన్ని దీవించు.
నీ పవిత్రశక్తినిచ్చి
మమ్మల్ని నడిపించు.
-
2. వాక్యం ద్వారా నేర్పు మాకు
నిన్నారాధించడము.
ప్రకటించే కళనివ్వు,
నింపు మాలో ప్రేమను.
-
3. ప్రసాదించు దేవా మాకు
ఐక్యతను, శాంతిని.
మా నడత తండ్రీ నీకు
తెచ్చు గాక కీర్తిని.
(కీర్త. 22:22; 34:3; యెష. 50:4 కూడా చూడండి.)