పాట 71
యెహోవా సైన్యం మనం!
-
1. యెహోవా సైన్యం మనం,
క్రీస్తు దాసులం.
సాతాను అడ్డుకున్నా,
ముందుకు సాగుతాం.
నమ్మకంగా సేవిస్తూ,
సువార్త చెప్తాం;
దృఢ సంకల్పంతో
ధైర్యంగా ఉన్నాం.
(పల్లవి)
యెహోవా సైన్యం మనం;
చాటిస్తూ ఉందాం,
దేవుని పాలన
మొదలైందని.
-
2. యెహోవా సేవకులం,
వెదుకుతున్నాం
తప్పిపోయి దుఃఖించే
తన గొర్రెలను.
కనుగొని వాటిని,
పోషిస్తాం మనం;
ఆహ్వానిస్తాం రాజ్య
మందిరానికి.
(పల్లవి)
యెహోవా సైన్యం మనం;
చాటిస్తూ ఉందాం,
దేవుని పాలన
మొదలైందని.
-
3. యెహోవా సైన్యం మనం,
క్రీస్తు ఆజ్ఞతో
సంపూర్ణంగా సిద్ధమై
ఉన్నాం సుస్థిరంగా.
వివేచన చూపిస్తాం,
నీతిగా ఉంటాం.
సత్యాన్నే పాటిస్తాం,
అపాయం ఉన్నా.
(పల్లవి)
యెహోవా సైన్యం మనం;
చాటిస్తూ ఉందాం,
దేవుని పాలన
మొదలైందని.
(ఫిలి. 1:7; ఫిలే. 2 కూడా చూడండి.)