కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 6

ఆకాశాలు యెహోవా మహిమను ప్రకటిస్తున్నాయి

ఆకాశాలు యెహోవా మహిమను ప్రకటిస్తున్నాయి

(19వ కీర్తన)

  1. 1. ఆకాశాలు యెహోవా చేతి కార్యం;

    తన మహిమను

    వెల్లడిస్తున్నాయి.

    ప్రతీ రోజు తెస్తుంది స్తుతులు.

    ఆయన శక్తిని గూర్చి

    చెప్తాయి తారలు.

  2. 2. పరిపూర్ణం యెహోవా ధర్మశాస్త్రం;

    ప్రతీ ఒక్కరికి

    ఇస్తుంది నిర్దేశం.

    ఎంతో సత్యం ఆయన తీర్పులు.

    తేనెకన్నా తీయనిది

    ఆయన నియమం.

  3. 3. దైవభయం ఉంటుంది ఎల్లకాలం.

    బంగారాన్ని మించే

    దేవుని శాసనం

    రక్షిస్తుంది పాటించే వాళ్లను.

    మహిమపరుద్దాం మనం

    ఆయన పేరును.

(కీర్త. 111:9; 145:5; ప్రక. 4:11 కూడా చూడండి.)