పాట 55
శత్రువులకు భయపడకండి!
-
1. ఓ నా ప్రజలారా, మీరు
సువార్త పని చేస్తూ
సాగిపోండి ముందుకు;
ధైర్యాన్ని కోల్పోవద్దు.
సాతాన్ని పడద్రోశాడు
నా కుమారుడు యేసు.
త్వరలో బంధించి వాణ్ణి,
రక్షిస్తాడు మిమ్మల్ని.
(పల్లవి)
నా ప్రియ సేవకుల్లారా,
వైరికి భీతిల్లొద్దు.
కాపాడతాను మిమ్మల్ని,
కనుపాపల్లా నేను.
-
2. శత్రువులు వేవేలున్నా,
ఎగతాళి చేసినా,
దూషించి హింసించినా,
జడియద్దు ఏమైనా.
నేను మీకు తోడైవుంటా
నా ప్రియ ప్రజల్లారా;
ధైర్యమునిస్తా మెండుగా,
రక్షిస్తా కడదాకా.
(పల్లవి)
నా ప్రియ సేవకుల్లారా,
వైరికి భీతిల్లొద్దు.
కాపాడతాను మిమ్మల్ని,
కనుపాపల్లా నేను.
-
3. శత్రువులు క్రూరులైనా
అండగా నేనుంటాను.
మీకెందుకు భయము?
అందిస్తా నా హస్తము.
ప్రాణాలు తీయడం తప్ప
చేయలేరేమీ వాళ్లు.
నమ్మకంగా ఉంటే మీరు,
ఇస్తా జీవాన్ని నేను.
(పల్లవి)
నా ప్రియ సేవకుల్లారా,
వైరికి భీతిల్లొద్దు.
కాపాడతాను మిమ్మల్ని,
కనుపాపల్లా నేను.
(ద్వితీ. 32:10; నెహె. 4:14; కీర్త. 59:1; 83:2, 3 కూడా చూడండి.)