పాట 41
దయచేసి నా ప్రార్థన ఆలకించు
-
1. పరలోకంలో ఉన్న తండ్రి,
నీవు ఎంతో దయాళుడవు.
కీర్తిస్తాను నీ నామమును;
(పల్లవి)
నా ప్రార్థనను ఆలకించు.
-
2. ఈ జీవాన్ని ఇచ్చావు నువ్వే,
చేయిపట్టి నడిపిస్తావు.
చెల్లిస్తాను కృతజ్ఞతలు;
(పల్లవి)
నా ప్రార్థనను ఆలకించు.
-
3. కష్టాలను తట్టుకునేలా
ఇవ్వు నాకు బలాధిక్యము.
నడిపించు నీ మార్గంలోనే;
(పల్లవి)
నా ప్రార్థనను ఆలకించు.
(నిర్గ. 22:27; కీర్త. 106:4; యాకో. 5:11 కూడా చూడండి.)