పాట 40
మనం ఎవరి పక్షం?
-
1. నువ్వెవరి పక్షం?
ఏ దేవునికి సొంతం?
ఎవ్వరికి మోకరిస్తావో
ఆయనేగా నీ ప్రభువు.
సేవించలేం మనం
ఇద్దరు దేవుళ్లను.
మనసులోన నిండిన ప్రేమ
పంచలేం ఇద్దరికీ.
-
2. నువ్వెవరి పక్షం?
ఏ దేవునికి సొంతం?
నిర్ణయముంది నీ చేతుల్లో
ఎటువైపు నిల్చుంటావో
ఈ లోకంకే నువ్వు
దాసోహమైపోతావో
నీ మేలు కోరే ఆ దేవుడినే
ప్రాణంగా ప్రేమిస్తావో
-
3. నే యెహోవా పక్షం,
నేను ఆయన సొంతం.
నా తండ్రి సేవ చేసుకుంటూ
స్తుతిస్తాను ప్రతిరోజూ
ఎంతో త్యాగం చేసి
ప్రేమ చూపించినందుకు
ఈ జీవితమే నీ కోసమంటూ
అర్పిస్తా ఆనందంగా.
(యెహో. 24:15; కీర్త. 116:14, 18; 2 తిమో. 2:19 కూడా చూడండి.)