పాట 38
ఆయనే నిన్ను బలపరుస్తాడు
-
1. సరైనది చేయాలనే ఆ కోరిక
చూశాడు నాడే నీలో దేవుడు.
చీకటిలో నుండి వెలుగు వైపుకు
నడిపించాడు ప్రేమతో నిన్ను.
నీ చిత్తం చేస్తానని మాటిచ్చావ్;
విడువడు నీ చేయి ఎన్నడూ.
(పల్లవి)
క్రీస్తు రక్తంతో నిన్ను
కొన్నాడు కాబట్టి
తానే స్థిరపర్చి,
బలపరుస్తాడు.
ఇస్తాడు నిర్దేశాన్ని
కాపాడుతూ నిన్ను;
తానే స్థిరపర్చి,
బలపరుస్తాడు.
-
2. తన కుమారుణ్ణి అర్పించడానికి
సంకోచించనే లేదు ఏమాత్రం.
ప్రియ కుమారుణ్ణి ఇచ్చిన దేవుడే,
ఇస్తాడు నీకు బలాన్ని కూడా.
సంరక్షిస్తాడు తన పిల్లల్ని;
మరువడు విశ్వాస ప్రేమల్ని.
(పల్లవి)
క్రీస్తు రక్తంతో నిన్ను
కొన్నాడు కాబట్టి
తానే స్థిరపర్చి,
బలపరుస్తాడు.
ఇస్తాడు నిర్దేశాన్ని
కాపాడుతూ నిన్ను;
తానే స్థిరపర్చి,
బలపరుస్తాడు.
(రోమా. 8:32; 14:8, 9; హెబ్రీ. 6:10; 1 పేతు. 2:9 కూడా చూడండి.)