పాట 36
మన హృదయాల్ని కాపాడుకుందాం
-
1. కాపాడుకుందాం హృదయం;
జీవధార అది.
దారి తప్పవచ్చు అది;
మోసకరమైంది.
నిరంతరం మన తండ్రి
చూస్తాడు దానిని.
హృదయానికి నేర్పుదాం
యెహోవా మార్గాల్ని.
-
2. లోబడే హృదయం కోసం
సదా ప్రార్థిద్దాము.
తండ్రిపై భారం మోపుదాం;
స్తుతిద్దాం ఆయన్ని.
యెహోవా నేర్పేవాటికి
లోబడుతూ ఉందాం.
విధేయతతో ఆయన్ని
సంతోషపెడదాం.
-
3. చెడు ఆలోచన వీడి,
మంచిని ప్రేమిద్దాం.
హృదయంలో వాక్యం నింపి,
బలాన్ని పొందుదాం.
తన భక్తుల్ని యెహోవా
సదా ప్రేమిస్తాడు.
యెహోవాతో స్నేహం చేస్తూ
సేవిద్దాం ఆయన్ని.
(కీర్త. 34:1; ఫిలి. 4:8; 1 పేతు. 3:4 కూడా చూడండి.)