పాట 31
దేవునితో నడవండి!
(మీకా 6:8)
-
1. యెహోవాతో నడవండి,
దీనులై మీరుండండి.
నమ్మకమైన ప్రేమ చూపిస్తూ,
జీవించండి న్యాయంగా.
వాక్యాన్నెప్పుడూ పాటిస్తుంటే,
ఉంటారు స్థిరంగా.
చేయిపట్టి యెహోవాయే
నడిపిస్తాడు సదా.
-
2. యెహోవాతో నడవండి,
శుద్ధులై మీరుండండి.
శోధనలెన్నో ఎదురౌతున్నా,
చేస్తాడు సాయం తానే.
పవిత్రమైన వాటి గూర్చి
ధ్యానిస్తుంటే మీరు,
నమ్మకంగా ఉండవచ్చు
యెహోవాకు ఎప్పుడూ.
-
3. యెహోవాతో నడవండి,
ఉండండి సంతోషంగా.
ఆయన ఇచ్చే ప్రతీ వరాన్ని
అమూల్యంగా ఎంచండి.
సంతోషగానం చేస్తూ మీరు
సేవిస్తే దేవుణ్ణి,
యెహోవా సొంతం మీరని
గుర్తిస్తారు అందరూ.
(ఆది. 5:24; 6:9; ఫిలి. 4:8; 1 తిమో. 6:6-8 కూడా చూడండి.)