పాట 25
దేవుని ప్రత్యేక సొత్తు
-
1. నీ గొప్ప ప్రేమతోటి
నీ చేతి కొత్త సృష్టి
పాలించేలా యేసుతో
అభిషేకించావు.
(పల్లవి)
ప్రత్యేక బంధంగా,
పవిత్ర జనాంగంగా,
నీ చిన్న మందగా,
అయ్యారు స్తుతించేవారిగా!
-
2. నిర్మల మనస్సుతో
సత్యాన్ని సంరక్షించి,
నిశి రాత్రి వెన్నెలై
వెలుగు నింపారు!
(పల్లవి)
ప్రత్యేక బంధంగా,
పవిత్ర జనాంగంగా,
నీ చిన్న మందగా,
అయ్యారు స్తుతించేవారిగా!
-
3. గొర్రెపిల్ల మాటల్ని
మనసారా వింటారు,
మందలోకి తెస్తారు
ఆ వేరే ప్రజల్ని!
(పల్లవి)
ప్రత్యేక బంధంగా,
పవిత్ర జనాంగంగా,
నీ చిన్న మందగా,
అయ్యారు స్తుతించేవారిగా!
(యెష. 43:20ఎ, 21; మలా. 3:17; కొలొ. 1:13 కూడా చూడండి.)