పాట 156
విశ్వాసంతో భవిష్యత్తును చూడండి
1. సింహమంటే ఏం భయం?
ఏ శత్రుకీ బెదర్ను.
నా యెహోవే నా ధైర్యం,
దాగడం దేనికి?
నా దేవుడేలే నా స్థైర్యం.
(పల్లవి)
విశ్వాసంతో,
కష్టాల్ని మించి చూస్తా.
విశ్వాసంతో,
పోయింది నా భయం.
నా యెహోవే
నా శక్తి,
ఇస్తుందదే స్ఫూర్తి.
నా చెంతే ఉంటాడు దేవుడు—
విశ్వాసంతో.
2. నమ్మకమే శ్వాసగా
జీవించారు ఆనాడు.
సహిస్తూ వాళ్లంతా,
సాగారు ముందుకు.
లేస్తారంతా మళ్లీ వాళ్లు.
(పల్లవి)
విశ్వాసంతో,
కష్టాల్ని మించి చూస్తా.
విశ్వాసంతో,
పోయింది నా భయం.
నా యెహోవే
నా శక్తి,
ఇస్తుందదే స్ఫూర్తి.
నా చెంతే ఉంటాడు దేవుడు—
విశ్వాసంతో.
(బ్రిడ్జ్)
విశ్వాసంతో,
కొండనే తోస్తాను.
విశ్వాసంతో
నిరీక్షిస్తా.
ఏమయ్యేదో
విశ్వాసం నాలో
లేకుంటే,
ముంచేవి కష్టాలే నన్ను.
3. బంగారు లోకమును,
నే చూస్తున్నా కదా.
ఇదే ధైర్యంతో,
నేనిలా వేచుంటా.
నా యెహోవాకై నే వేచుంటా.
(పల్లవి)
విశ్వాసంతో,
కష్టాల్ని మించి చూస్తా.
విశ్వాసంతో,
పోయింది నా భయం.
నా యెహోవే
నా శక్తి,
ఇస్తుందదే స్ఫూర్తి.
నా చెంతే ఉంటాడు దేవుడు—
విశ్వాసంతో,
విశ్వాసంతో.
(హెబ్రీ. 11:1-40 కూడా చూడండి.)