పాట 141
జీవం ఒక అద్భుతం
-
1. పసిపిల్లలు, చిరుజల్లులు,
మెరిసేటి కిరణం అద్భుతాలే.
దేవుడిచ్చిన బహుమానాలు
ప్రతిరోజు మనమంతా ఆనందిస్తాం.
(పల్లవి)
ఎంతో అరుదైన వరమే జీవం;
ఇచ్చిన మన తండ్రిని ప్రేమిస్తూ ఉందాం.
సంపాదించుకోలేం మనంతట మనం
దీన్ని ఎప్పటికీ, ఈ బహుమానాన్ని.
-
2. కొందరుంటారు యోబు భార్యలా,
కృంగిపోయి సేవను ఆపేస్తారు.
మనం మాత్రము మన తండ్రిని
ప్రతీక్షణం సంతోషంగా స్తుతిస్తాము.
(పల్లవి)
ఎంతో అరుదైన వరమే జీవం;
ప్రేమిద్దాం మన చుట్టూరా ఉన్న వాళ్లను.
సంపాదించుకోలేం మనంతట మనం
దీన్ని ఎప్పటికీ, ఈ బహుమానాన్ని.
(యోబు 2:9; కీర్త. 34:12; ప్రసం. 8:15; మత్త. 22:37-40; రోమా. 6:23 కూడా చూడండి.)