పాట 139
కొత్త లోకంలో మిమ్మల్ని చూసుకోండి!
-
1. స్వేచ్ఛా, శాంతి ఉండే లోకం
మనందరం చూస్తాము త్వరలో.
దుష్టత్వమే ఉండదిక,
నీతి వర్ధిల్లు ఆ రాజ్యంలో.
అంతేలేని ఆ పాలన
తెస్తుందెన్నో ఆశీర్వాదాలు.
ఊహించండి మీరున్నట్టు అక్కడ,
నిండు హృదయంతో
కీర్తిస్తాము మనం:
(పల్లవి)
యెహోవా దేవా, మహా అద్భుతం!
క్రీస్తు రాజ్యంలో అంతా నూతనం.
మా స్తుతి గీతాలు ఆలకించు దేవా;
నీకే చెల్లాలి మహిమ, ప్రభావము.
-
2. ఎంతో రమ్యం దైవ రాజ్యం,
భీతిభయం లేనేలేవు ఇక;
సొంతమైంది కొత్త భూమి,
నిజం చేశాడు వాగ్దానాన్ని.
తోడున్నాడు యెహోవాయే,
ఆ నీడ కిందే ఉన్నాం మనం.
మృతులందర్నీ లేపుతాడాయన,
ఐక్యంగా దేవుణ్ణి
స్తుతిస్తాం అందరం:
(పల్లవి)
యెహోవా దేవా, మహా అద్భుతం!
క్రీస్తు రాజ్యంలో అంతా నూతనం.
మా స్తుతి గీతాలు ఆలకించు దేవా;
నీకే చెల్లాలి మహిమ, ప్రభావము.
(కీర్త. 37:10, 11; యెష. 65:17; యోహా. 5:28; 2 పేతు. 3:13 కూడా చూడండి.)