పాట 125
“కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”
-
1. కరుణ చూపే యెహోవా
ఉంటాడెంతో సంతోషంగా.
రోజూ కరుణ చూపిస్తూ
ఇస్తున్నాడెన్నో మనకు.
పశ్చాత్తాపం చూపేవాళ్ల
మొరను ఆలకిస్తాడు.
మట్టివాళ్లని గుర్తించి,
కనికరం చూపిస్తాడు.
-
2. పాపాన్ని చేసినప్పుడు,
క్షమించమని దేవుణ్ణి
వేడుకునే పద్ధతిని
నేర్పాడు యేసు మనకు.
“మేము మా ఋణస్థులను
క్షమించినట్టే మా తండ్రీ,
క్షమించు మా తప్పులనూ”
అంటూ ప్రార్థించమన్నాడు.
-
3. దానధర్మాలు చేస్తుంటే,
గొప్పతనాన్ని కోరక,
ఉదారస్ఫూర్తి చూపిస్తూ
సంతోషంగా ఇస్తూ ఉందాం.
అప్పుడే మనం పొందుతాం
దేవుడిచ్చే ప్రతిఫలం.
ఆయన దృష్టిలో మనం
ఎంతో అందంగా ఉంటాము.
(మత్త. 6:2-4, 12-14 కూడా చూడండి.)