కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 119

మనకు విశ్వాసం ఉండాలి

మనకు విశ్వాసం ఉండాలి

(హెబ్రీయులు 10:38, 39)

  1. 1. పూర్వం నిర్దేశించాడు దేవుడు

    తన ప్రవక్తల ద్వారా.

    నేడు ‘మనసు మార్చుకోండని’

    చెప్పాడు యేసు ద్వారా.

    (పల్లవి)

    విశ్వాసం ఉందా మనకు?

    రక్షణకది ముఖ్యము.

    చూపిస్తున్నామా క్రియల్లో?

    అప్పుడే దక్కుతుంది జీవము.

  2. 2. రాజ్య వార్తను చాటించాలనే

    క్రీస్తాజ్ఞకు లోబడతాం.

    తండ్రి చేసిన వాగ్దానం గూర్చి

    ధైర్యంగా ప్రకటిస్తాం.

    (పల్లవి)

    విశ్వాసం ఉందా మనకు?

    రక్షణకది ముఖ్యము.

    చూపిస్తున్నామా క్రియల్లో?

    అప్పుడే దక్కుతుంది జీవము.

  3. 3. దృఢ నమ్మకం ఇస్తుంది బలం,

    వెనుదీయము ఎన్నడూ.

    అతిత్వరలో రానుంది అంతం

    నమ్మకంతో సహిద్దాం.

    (పల్లవి)

    విశ్వాసం ఉందా మనకు?

    రక్షణకది ముఖ్యము.

    చూపిస్తున్నామా క్రియల్లో?

    అప్పుడే దక్కుతుంది జీవము