పాట 114
ఓర్పు చూపించండి
-
1. యెహోవా మన తండ్రి
ఆసక్తితో చూస్తున్నాడు;
పేరుపై నిందలన్నీ
తీసేయాలనుకున్నాడు.
తరాలుగా ఆయన
సహనం వహించాడు;
ఓర్పును చూపడంలో
అలసిపోలేదు.
రక్షణ పొందాలని
అన్నిరకాల ప్రజలు,
యెహోవా చూపే ఓర్పు
వృథాకాదు ఎప్పటికీ.
-
2. నడుస్తూ ఉండాలంటే
దేవుని మార్గంలో మనం,
ఓర్పెంతో అవసరం;
ఇస్తుందదే మనశ్శాంతి.
చూస్తుంది ఇతరుల్లో
మంచిని ఎల్లప్పుడూ.
కష్టాలు ముంచెత్తినా,
కంగారుపడదు.
పవిత్రశక్తి నింపే
సుగుణమైన ఓర్పును,
చూపినప్పుడు మనం
దేవుని పోలి నడుస్తాం.
(నిర్గ. 34:14; యెష. 40:28; 1 కొరిం. 13:4, 7; 1 తిమో. 2:4 కూడా చూడండి.)

