పాట 106
ప్రేమను అలవర్చుకుందాం
-
1. దేవునిలా ప్రేమ చూపిస్తూ
సాయం చేయమని ప్రార్థిస్తాం.
పవిత్ర శక్తుంటే మనలో
చూపిస్తాం ప్రేమనే లక్షణం.
ఉండొచ్చు ప్రతిభ, తెలివి;
లేకుంటే ప్రేమ వ్యర్థం అన్నీ.
విశ్వసనీయ ప్రేమ కోసం,
రోజూ దేవుణ్ణి వేడుకుందాం.
-
2. సోదరుల మీద ప్రేముంటే,
చూసుకోం ఎన్నడూ స్వార్థాన్ని.
ద్వేషానికి చోటివ్వకుండా,
చూపిస్తాం వాళ్లపై దయను.
ప్రేముంటే క్షమిస్తాం తప్పులు,
భరిస్తాం ఎన్నో బరువులు.
గుర్తుంచుకుందాం కష్టాలొస్తే,
సహిస్తుందని ప్రేమ అన్నీ.
(యోహా. 21:17; 1 కొరిం. 13:13; గల. 6:2 కూడా చూడండి.)