కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 100

వాళ్లకు ఆతిథ్యం ఇవ్వండి

వాళ్లకు ఆతిథ్యం ఇవ్వండి

(అపొస్తలుల కార్యాలు 17:7)

  1. 1. అతిథిప్రియుడు యెహోవా ఎంతో;

    చూపిస్తాడు అందరిపై శ్రద్ధను.

    వర్షాన్ని, సూర్యుణ్ణి

    ఇస్తూ అందరిలో

    నింపుతున్నాడెంతో సంతోషం.

    దీనులకు సాయం చేస్తుంటే మనం,

    యెహోవా తండ్రికి పిల్లలమౌతాం.

    మంచిమనసుతో

    చూపిస్తే దయను,

    ఆశీర్వదిస్తాడు దేవుడు.

  2. 2. సహాయం చేస్తుంటే ఇతరులకు,

    అవసరములో ఉన్నవాళ్లకు;

    ఆతిథ్యస్ఫూర్తితో

    చేయందిస్తే మనం,

    జరగవచ్చు ఎంతో మేలు.

    ఆనాటి లూదియ అనే స్త్రీలాగే

    ఆహ్వానిస్తాం మనం ఇతరులను.

    మన తండ్రిలాగే

    చూపిస్తే కరుణ,

    మరువడెప్పుడూ ఆయన.