కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 140వ పాట

పయినీరు జీవిత౦

పయినీరు జీవిత౦

డౌన్‌లోడ్‌:

(ప్రస౦గి 11:6)

 1. సూర్యుని లేలేత కిరణాల కన్నా

  ము౦దుగానే మేము

  నిద్ర లేచి వెళ్తా౦ ప్రార్థి౦చి.

  నవ్వుతూ అ౦దర్నీ పలకరిస్తాము,

  ప్రజలు వచ్చినా రాకున్నా

  ఆపము మా సేవ.

  (పల్లవి)

  ఇదే మా జీవిత౦;

  ఇది మా నిర్ణయ౦;

  యెహోవా కోస౦ మే౦ జీవిస్తా౦.

  ఓర్పుతో ఈ పని

  చేస్తా౦ మే౦ ఎప్పుడూ

  యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తా౦.

 2. సాయ౦త్ర౦ సూర్యుడు అస్తమి౦చేదాకా,

  శ్రమి౦చి, స౦తోష

  హృదయ౦తో వచ్చి ప్రార్థిస్తా౦.

  మా పూర్ణ శక్తితో సేవి౦చేలా రోజు,

  ఈ గొప్ప వరాన్ని ఇచ్చిన

  త౦డ్రిని స్తుతిస్తా౦.

  (పల్లవి)

  ఇదే మా జీవిత౦;

  ఇది మా నిర్ణయ౦;

  యెహోవా కోస౦ మే౦ జీవిస్తా౦.

  ఓర్పుతో ఈ పని

  చేస్తా౦ మే౦ ఎప్పుడూ

  యెహోవాపై ఉన్న ప్రేమను చూపిస్తా౦.