ప్రత్యేక పాటలు

సమయాన్ని కొనుక్కుంటా

తెలుగు
సమయాన్ని కొనుక్కుంటా
https://cms-imgp.jw-cdn.org/img/p/502900115/univ/art/502900115_univ_sqr_xl.jpg

సమయాన్ని కొనుక్కుంటా

సమయాన్ని కొనుక్కుంటా
  1. 1. కాలం నా కోసమాగుతుందా

    క్షణాలే పొగల్లే మాయం

    ఈ ప్రాణం తుఫానులో సముద్రం

    భూవిపై చెదిర్తే రాదే ఏం చేస్తా!

    (పల్లవి)

    కానీ రోజులో పనుల్కే నా టైమే పోతుంటే

    మనవాళ్లనే పట్టించుకుంటానా?

    చేస్తా మర్నాడే అనంటూ వేస్తానే వాయిదా

    గడువులే నా సవాలు లోకంలో

    అలా చేస్తూ నెడుతున్నా సమయం సొంతమయ్యేనా?

  2. 2. విశ్వాన్ని ఆస్వాదించి చూసా

    యెహోవా ప్రేమే దాని రూపం

    తండ్రికే ఏమి తిరిగివ్వనూ?

    నా శక్తి నా సమయం ఇస్తా పూర్తిగా

    (పల్లవి)

    కానీ రోజులో పనుల్కే నా టైమే పోతుంటే

    సృష్టికర్తనే పట్టించుకుంటానా?

    చేస్తా మర్నాడే అనంటూ వేస్తానే వాయిదా

    గడువులే నా సవాలు లోకంలో

    అలా చేస్తూ నెడుతున్నా సమయం సొంతమయ్యేనా?

    (బ్రిడ్జ్‌)

    రేపటి బహుమానం నా సొంతం

    కలగన్న ఆ రాజ్యం

    ఈ ప్రాణం సమర్పించి లోబడి

    పరదైసే సాధిస్తా

    (పల్లవి)

    అలా రోజులో పనుల్కే నా టైంనే పోనీక

    మనవాళ్లని పట్టించుకుంటాను

    చేస్తా ఇప్పుడే అనంటూ దేవునికే చోటిస్తా

    గడిపేస్తా టైం ఇంటిల్లిపాదిగా

    ఫలించి ఎంతో కృషిస్తున్నా సమయం సొంతమయ్యేలా.