నీ ఇష్టమే నా ఊపిరి (2025 ప్రాదేశిక సమావేశ పాట)

నీ ఇష్టమే నా ఊపిరి (2025 ప్రాదేశిక సమావేశ పాట)

(కీర్తన 40:8)

  1. 1. యేసొచ్చాడు, ఈ భూమిపైకే

    నీ పని మీదే ధ్యాసంతా

    నీ మాటలేగా గుండె నిండా

    నీ పేరే చాటాడుగా

    నిప్పులాంటి నిజాయితితో

    నీ వైపే ఉన్నాడుగా

    ఎంతో ఆదర్శం యేసు కథ

    ఆయనలా నేవుంటా...

    (పల్లవి)

    నీ ఇష్టమే నా ఊపిరి

    సంతోషాన్నే ఇస్తుందది

    అసలైన ఆస్తి నువ్వే

    నా బలం, సర్వం నువ్వే

    నీ ఇష్టమే నా ఊపిరి

    ఆనందాన్నే తెస్తుందది

    అసలైన ప్రేమ నీదే

    నా మాట, పాట నీదే

    నిజమిదే!

  2. 2. యెహోవా, నీ పరిచయంతో

    సంతృప్తిగా జీవిస్తున్నా

    నీ మనిషై, నీ వైపునుంటా

    నీ వాళ్లతో నడుస్తా

    నీ సత్యం మాకో నిధి కాదా?

    దాచకుండా, నే చెప్తా

    నీ పని చేస్తా ఉల్లాసంగా

    నా సర్వస్వం నీకిస్తా...

    (పల్లవి)

    నీ ఇష్టమే నా ఊపిరి

    సంతోషాన్నే ఇస్తుందది

    అసలైన ఆస్తి నువ్వే

    నా బలం, సర్వం నువ్వే

    నీ ఇష్టమే నా ఊపిరి

    ఆనందాన్నే తెస్తుందది

    అసలైన ప్రేమ నీదే

    నా మాట, పాట నీదే

    నిజమిదే!

    ఎంతో ఆనందమే...

(కీర్త. 40:3, 10 కూడా చూడండి.)