రాజులు రెండో గ్రంథం 13:1-25

  • యెహోయాహాజు, ఇశ్రాయేలు రాజు (1-9)

  • యెహోయాషు, ఇశ్రాయేలు రాజు (10-13)

  • ఎలీషా యెహోయాషు ఉత్సాహాన్ని పరీక్షించడం (14-19)

  • ఎలీషా మరణం; అతని ఎముకలు తగిలి ఒక వ్యక్తి బ్రతకడం (20, 21)

  • ఎలీషా చివరి ప్రవచనం నెరవేరడం (22-25)

13  యూదా రాజూ అహజ్యా+ కుమారుడూ అయిన యెహోయాషు+ పరిపాలనలోని 23వ సంవత్సరంలో, యెహూ కుమారుడైన యెహోయాహాజు+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతను 17 సంవత్సరాలు పరిపాలించాడు.  యెహోయాహాజు యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు, అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్నే+ చేస్తూ వచ్చాడు. అతను దాని నుండి పక్కకు మళ్లలేదు.  కాబట్టి యెహోవా కోపం+ ఇశ్రాయేలు మీద రగులుకుంది;+ ఆయన ఇశ్రాయేలును సిరియా రాజైన హజాయేలు చేతికి,+ అతని కుమారుడైన బెన్హదదు+ చేతికి అప్ప​గిస్తూ వచ్చాడు.  కొంతకాలానికి, యెహోయాహాజు యెహోవా అనుగ్రహం కోసం వేడుకున్న​ప్పుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల్ని అణచివేయడం ఆయన చూశాడు.+  కాబట్టి సిరియా చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి యెహోవా వాళ్లకు ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు.+ దాంతో ఇశ్రాయేలీయులు ముందులాగే* తమ ఇళ్లలో నివసించగలిగారు.  (అయితే వాళ్లు, యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన యరొబాము ఇంటివాళ్ల పాపాన్ని విడిచిపెట్టలేదు.+ ఇశ్రాయేలీయులు ఆ పాపాన్ని చేస్తూనే ఉన్నారు, సమరయలో పూజా కర్ర*+ అలాగే ఉంది.)  యెహోయాహాజు సైన్యంలో 50 మంది గుర్రపురౌతులు, 10 రథాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలారు. ఎందుకంటే సిరియా రాజు, గోధుమలు నూర్చేటప్పుడు దుమ్మును తొక్కి​నట్టు వాళ్లను తొక్కి+ నాశనం చేశాడు.+  యెహోయాహాజు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది.  తర్వాత యెహోయాహాజు చనిపోయాడు.* అతన్ని సమరయలో పాతిపెట్టారు;+ అతని స్థానంలో అతని కుమారుడు యెహోయాషు రాజయ్యాడు. 10  యూదా రాజైన యెహోయాషు పరిపాలనలోని 37వ సంవత్సరంలో, యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు+ సమరయలో ​ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 11  అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు, అతను నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాలన్నిటినీ విడిచిపెట్టకుండా వాటిని చేస్తూ వచ్చాడు.+ 12  యెహోయాషు మిగతా చరిత్ర గురించి, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతని పరాక్రమ కార్యాల గురించి, అతను యూదా రాజైన అమజ్యాతో ఎలా యుద్ధం చేశాడనే+ దాని గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 13  తర్వాత యెహోయాషు చనిపోయాడు,* అతని సింహాసనం మీద యరొబాము*+ కూర్చున్నాడు. యెహోయాషును ఇశ్రాయేలు రాజులతోపాటు సమరయలో పాతిపెట్టారు.+ 14  తర్వాత ఎలీషాకు+ జబ్బు చేసింది, ఆ అనారోగ్యంతోనే కొంతకాలానికి అతను చనిపోయాడు. అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతని గురించి ఏడుస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపురౌతులు!” అన్నాడు.+ 15  అప్పుడు ఎలీషా అతనితో, “విల్లును, బాణాల్ని తీసుకో” అన్నాడు. అతను ఒక విల్లును, బాణాల్ని తీసుకున్నాడు. 16  తర్వాత ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “విల్లును నీ చేతిలోకి తీసుకో” అన్నాడు. అతను దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఎలీషా తన చేతుల్ని రాజు చేతుల మీద ఉంచాడు. 17  తర్వాత ఎలీషా, “తూర్పు వైపున్న కిటికీ తెరువు” అన్నాడు. రాజు ఆ కిటికీ తెరిచాడు. అప్పుడు ఎలీషా, “బాణం వేయి!” అన్నాడు. అతను బాణం వేశాడు. అప్పుడు ఎలీషా, “యెహోవా విజయ* బాణం, సిరియా మీద విజయ* బాణం! నువ్వు సిరియాను పూర్తిగా నాశనం చేసేంతవరకు ఆఫెకు+ దగ్గర సిరియావాళ్లను ఓడిస్తావు”* అన్నాడు. 18  తర్వాత ఎలీషా, “బాణాలు తీసుకో” అన్నాడు. ఇశ్రాయేలు రాజు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఎలీషా అతనితో, “నేలను కొట్టు” అన్నాడు. అతను నేలను మూడుసార్లు కొట్టి ఆపేశాడు. 19  అది చూసినప్పుడు సత్యదేవుని సేవకునికి రాజు మీద చాలా కోపం వచ్చింది. ఎలీషా రాజుతో ఇలా అన్నాడు: “నువ్వు నేలను ఐదారుసార్లు కొట్టివుండాల్సింది! అప్పుడు నువ్వు సిరియాను పూర్తిగా నాశనం చేసేంతవరకు వాళ్లను ఓడించేవాడివి, కానీ ఇప్పుడు నువ్వు సిరియావాళ్లను మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు.”+ 20  తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. సంవత్సరం ప్రారంభంలో* మోయాబీయుల దోపిడీ ముఠాలు+ దేశంలోకి వచ్చేవి. 21  చనిపోయిన ఒకతన్ని పాతిపెడుతున్న కొంతమంది ఆ దోపిడీ ముఠాను చూశారు. వెంటనే వాళ్లు ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పడేసి అక్కడి నుండి పారిపోయారు. ఎలీషా ​ఎముకలు తాకగానే అతను బ్రతికి,+ లేచి నిలబడ్డాడు. 22  సిరియా రాజైన హజాయేలు+ యెహోయాహాజు రోజులన్నిట్లో ఇశ్రాయేలును అణచి​వేశాడు.+ 23  అయితే, యెహోవా అబ్రాహాముతో,+ ఇస్సాకుతో,+ యాకోబుతో చేసిన ఒప్పందాన్ని బట్టి+ వాళ్లమీద అనుగ్రహం, కరుణ, శ్రద్ధ చూపించాడు.+ ఆయన వాళ్లను నాశనం చేయాలనుకోలేదు, ఈ రోజు వరకు ఆయన వాళ్లను తన ఎదుట నుండి వెళ్లగొట్టలేదు. 24  సిరియా రాజైన హజాయేలు చనిపోయినప్పుడు, అతని స్థానంలో అతని కుమారుడు బెన్హదదు రాజ​య్యాడు. 25  యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు, హజాయేలు ​కుమారుడైన బెన్హదదు దగ్గర నుండి కొన్ని ​నగరాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. హజాయేలు వాటిని గతంలో యెహోయాహాజుతో యుద్ధం ​చేసినప్పుడు ఆక్రమించుకు​న్నాడు. యెహోయాషు బెన్హదదును మూడుసార్లు ఓడించి,*+ ఆ ఇశ్రాయేలు నగ​రాల్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు.

అధస్సూచీలు

అంటే ప్రశాంతంగా, సురక్షితంగా.
పదకోశం చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
అంటే, యరొబాము II.
లేదా “రక్షణ.”
లేదా “రక్షణ.”
లేదా “హతం చేస్తావు.”
బహుశా వసంతకాలంలో కావచ్చు.
లేదా “హతం చేసి.”