దినవృత్తాంతాలు రెండో గ్రంథం 33:1-25

  • మనష్షే, యూదా రాజు (1-9)

  • చెడుతనం విషయంలో మనష్షే పశ్చాత్తాపం (10-17)

  • మనష్షే మరణం (18-20)

  • ఆమోను, యూదా రాజు (21-25)

33  మనష్షే+ రాజైనప్పుడు అతనికి 12 ఏళ్లు. అతను యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలించాడు.+  అతను ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన దేశాల అసహ్యమైన ఆచారాలు పాటిస్తూ యెహోవా దృష్టికి చెడు చేశాడు.+  అతను తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాల్ని మళ్లీ కట్టించాడు.+ అతను బయలు దేవుళ్లకు బలిపీఠాలు కట్టించాడు, పూజా కర్రల్ని* చేయించాడు, ఆకాశ సైన్యమంతటికీ మొక్కి వాటిని సేవించాడు.+  యెహోవా ఏ మందిరం గురించైతే, “యెరూషలేములో నా పేరు ఎప్పుడూ ఉంటుంది”+ అని అన్నాడో, ఆ యెహోవా మందిరంలో అతను బలిపీఠాల్ని కూడా కట్టించాడు.+  యెహోవా మందిరంలోని రెండు ప్రాంగణాల్లో+ అతను ఆకాశ సైన్యమంతటికీ బలిపీఠాలు కట్టించాడు.  అతను తన సొంత కుమారుల్ని బెన్‌హిన్నోము* లోయలో+ అగ్నిలో వేసి కాల్చాడు;*+ అతను ఇంద్రజాలం చేశాడు,+ శకునాలు చూశాడు, క్షుద్రవిద్య అభ్యసించాడు; చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, భవిష్యత్తు చెప్పేవాళ్లను+ నియమించాడు. అతను యెహోవా దృష్టిలో విపరీతంగా చెడ్డపనులు చేసి ఆయనకు కోపం తెప్పించాడు.  మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహాన్ని సత్యదేవుని మందిరంలో పెట్టించాడు.+ ఆ మందిరం గురించే దేవుడు దావీదుతో, అతని కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నేను ఈ మందిరంలో, అలాగే ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి నేను ఎంచుకున్న యెరూషలేములో నా పేరును శాశ్వతంగా ఉంచుతాను.+  ఇశ్రాయేలీయులు నేను వాళ్లకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమంతటినీ, శాసనాల్ని, న్యాయనిర్ణయాల్ని జాగ్రత్తగా పాటిస్తే వాళ్ల పూర్వీకులకు నేను ఇచ్చిన దేశం నుండి వాళ్లను ఎప్పటికీ వెళ్లగొట్టను.”  మనష్షే యూదావాళ్లను, యెరూషలేము నివాసుల్ని తప్పుదారిలో నడిపిస్తూ, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా నిర్మూలించిన దేశాల ప్రజల కన్నా ఘోరమైన పనులు వాళ్లతో చేయించాడు.+ 10  యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు; కానీ వాళ్లు ఆయన మాటల్ని పట్టించుకోలేదు.+ 11  దాంతో యెహోవా వాళ్లమీదికి అష్షూరు రాజు సైన్యాధిపతుల్ని రప్పించాడు; వాళ్లు మనష్షేను కొక్కేలతో* పట్టుకొని, రెండు రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు. 12  అతను వేదన అనుభవిస్తున్నప్పుడు, అనుగ్రహం కోసం తన దేవుడైన యెహోవాను బ్రతిమాలాడు, తన పూర్వీకుల దేవుని ఎదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. 13  అతను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుడు అతని విన్నపాన్ని బట్టి కదిలించబడ్డాడు, అనుగ్రహం కోసం అతను చేసిన ప్రార్థనను విన్నాడు. ఆయన మనష్షే యెరూషలేముకు తిరిగొచ్చి తన రాజరికాన్ని మళ్లీ పొందేలా చేశాడు.+ అప్పుడు యెహోవాయే సత్యదేవుడని మనష్షే తెలుసుకున్నాడు.+ 14  ఆ తర్వాత అతను లోయలో* ఉన్న గీహోనుకు+ పడమటి వైపు దావీదు నగరం+ బయటి గోడను కట్టించాడు. దాన్ని చేపల ద్వారం+ వరకు, అక్కడి నుండి ఓపెలు+ చుట్టూ కట్టించాడు. అతను దాన్ని ఎంతో ఎత్తుగా కట్టించాడు. అంతేకాదు, అతను యూదాలోని ప్రాకారాలుగల నగరాలన్నిట్లో సైన్యాధిపతుల్ని నియమించాడు. 15  తర్వాత అతను యెహోవా మందిరంలో నుండి అన్య దేవుళ్లను, విగ్రహాన్ని తీయించాడు.+ అతను యెహోవా మందిర పర్వతం మీద, యెరూషలేములో తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీయించి,+ వాటిని నగరం బయట పారవేయించాడు. 16  అంతేకాదు, అతను యెహోవా బలిపీఠాన్ని సిద్ధం చేయించి,+ దానిమీద సమాధాన బలుల్ని,+ కృతజ్ఞతార్పణల్ని+ అర్పించడం మొదలుపెట్టాడు; ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించమని అతను యూదావాళ్లకు చెప్పాడు. 17  అయినా, ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ ఉన్నారు, అయితే వాళ్లు తమ దేవుడైన యెహోవాకే వాటిని అర్పించారు. 18  మనష్షే మిగతా చరిత్ర, అంటే అతను తన దేవునికి చేసిన ప్రార్థన గురించి, దర్శనాలు చూసేవాళ్లు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున అతనితో చెప్పిన మాటల గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 19  అంతేకాదు అతని ప్రార్థన+ గురించి, అతని విన్నపం అనుగ్రహించబడడం గురించి, అతని పాపాలన్నిటి గురించి, అతని నమ్మకద్రోహం గురించి,+ అతను తనను తాను తగ్గించుకోక ముందు ఎక్కడెక్కడ ఉన్నత స్థలాల్ని కట్టించాడు, పూజా కర్రల్ని,* చెక్కిన విగ్రహాల్ని నిలబెట్టించాడు+ అనే వాటి గురించి అతని కోసం దర్శనాలు చూసేవాళ్లు రాసిన గ్రంథాల్లో రాయబడివుంది. 20  తర్వాత మనష్షే చనిపోయాడు,* అతన్ని అతని ఇంటి దగ్గర పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు.+ 21  ఆమోను+ రాజైనప్పుడు అతని వయసు 22 ఏళ్లు; అతను యెరూషలేములో రెండు సంవత్సరాలు పరిపాలించాడు.+ 22  అతను తన తండ్రి మనష్షేలాగే యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు.+ ఆమోను తన తండ్రి మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ+ బలి అర్పిస్తూ, వాటిని పూజిస్తూ ఉన్నాడు. 23  కానీ అతను తన తండ్రి మనష్షేలా+ యెహోవా ఎదుట తనను తాను తగ్గించుకోలేదు;+ పైగా ఆమోను తన అపరాధాన్ని ఎంతో పెంచుకున్నాడు. 24  కొంతకాలం తర్వాత అతని సేవకులు అతని మీద కుట్రపన్ని,+ అతన్ని తన ఇంట్లోనే చంపారు. 25  అయితే, దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వాళ్లందర్నీ చంపి,+ అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను+ రాజును చేశారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “అగ్ని గుండా దాటించాడు.”
అక్ష., “హిన్నోము కుమారుడి.”
లేదా “బండ సందుల్లో” అయ్యుంటుంది.
లేదా “వాగు దగ్గర.”
పదకోశం చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”