దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 9:1-44

  • చెర నుండి తిరిగొచ్చినవాళ్ల వంశావళులు (1-34)

  • సౌలు వంశం మళ్లీ చెప్పబడింది (35-44)

9  ఇశ్రాయేలీయులందరూ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు, వాళ్ల పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడ్డాయి. యూదావాళ్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్లు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు.+  తమ నగరాల్లోని తమ ప్రాంతాలకు మొదట తిరిగొచ్చిన వాళ్లలో కొంతమంది ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు* ఉన్నారు.+  యూదా,+ బెన్యామీను,+ ఎఫ్రాయిము, మనష్షే వంశస్థుల్లో కొంతమంది యెరూషలేములో స్థిరపడ్డారు. వాళ్లు:  యూదా కుమారుడైన పెరెసు+ వంశస్థుల్లో అమీహూదు కుమారుడైన ఊతై; అమీహూదు ఒమ్రీ కుమారుడు, ఒమ్రీ ఇమ్రీ కుమారుడు, ఇమ్రీ బానీ కుమారుడు.  షిలోనీయుల్లో, తన తండ్రి ఇంట్లో పెద్ద కుమారుడైన అశాయా, అతని కుమారులు.  అలాగే జెరహు కుమారుల్లో+ యెవుయేలు, వాళ్ల 690 మంది సహోదరులు.  బెన్యామీను వంశస్థుల్లో: హాసెనూయా మునిమనవడూ హోదవ్యా మనవడూ మెషుల్లాము కుమారుడూ అయిన సల్లు;  యెరోహాము కుమారుడైన ఇబ్నెయా; మిక్రి మనవడూ ఉజ్జీ కుమారుడూ అయిన ఏలా; ఇబ్నీయా మునిమనవడూ రగూయేలు మనవడూ షెఫట్య కుమారుడూ అయిన మెషుల్లాము.  అలాగే వంశావళి పట్టికలో నమోదైన వాళ్ల సహోదరులు 956 మంది. వీళ్లందరూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. 10  యాజకుల్లో: యెదాయా, యెహోయారీబు, యాకీను,+ 11  హిల్కీయా కుమారుడైన అజర్యా; హిల్కీయా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము సాదోకు కుమారుడు, సాదోకు మెరాయోతు కుమారుడు, మెరాయోతు సత్యదేవుని మందిర* అధిపతైన అహీటూబు కుమారుడు; 12  మల్కీయా మునిమనవడూ పషూరు మనవడూ యెరోహాము కుమారుడూ అయిన అదాయా; అదీయేలు కుమారుడైన మశై; అదీయేలు యహజేరా కుమారుడు, యహజేరా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము మెషిల్లేమీతు కుమారుడు, మెషిల్లేమీతు ఇమ్మేరు కుమారుడు; 13  అలాగే తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలైన వాళ్ల సహోదరులు 1,760 మంది; వాళ్లు బలవంతులు, సత్యదేవుని మందిరంలో సేవ చేయడానికి అందుబాటులో ఉన్న సమర్థులు. 14  లేవీయుల్లో: మెరారి వంశస్థుడైన హషబ్యా మునిమనవడూ అజ్రీకాము మనవడూ హష్షూబు కుమారుడూ అయిన షెమయా;+ 15  బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు మునిమనవడూ జిఖ్రీ మనవడూ మీకా కుమారుడూ అయిన మత్తన్యా; 16  యెదూతూను మునిమనవడూ గాలాలు మనవడూ షెమయా కుమారుడూ అయిన ఓబద్యా; ఎల్కానా మనవడూ ఆసా కుమారుడూ అయిన బెరెక్యా; ఇతను నెటోపాతీయుల+ పల్లెల్లో నివసించేవాడు. 17  ద్వారపాలకుల్లో:+ షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను; వాళ్ల సహోదరుడైన షల్లూము వాళ్లకు నాయకుడు. 18  అతను అంతకుముందు తూర్పు వైపున రాజ ద్వారం+ దగ్గర ఉండేవాడు. వీళ్లు లేవీయుల పాలెములకు ద్వారపాలకులు. 19  కోరహు మునిమనవడూ ఎబ్యాసాపు మనవడూ కోరే కుమారుడూ అయిన షల్లూము, అతని పూర్వీకుల కుటుంబాలకు చెందిన కహాతీయులైన అతని సహోదరులు గుడారం ద్వారపాలకులుగా ఉంటూ సేవకు సంబంధించిన పనులు చూసుకునేవాళ్లు. వాళ్ల తండ్రులు ప్రవేశమార్గం దగ్గర కాపలా కాస్తూ యెహోవా పాలెమును చూసుకునేవాళ్లు. 20  ఎలియాజరు+ కుమారుడైన ఫీనెహాసు+ అంతకుముందు వాళ్లకు నాయకుడు; యెహోవా అతనికి తోడుగా ఉండేవాడు. 21  మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ద్వారపాలకుడు. 22  గడపల దగ్గర ద్వారపాలకులుగా ఎంపిక చేయబడిన వాళ్లందరూ 212 మంది. వాళ్లు తమ వంశావళి పట్టిక ప్రకారం+ తమ పల్లెల్లో ఉండేవాళ్లు. వాళ్లు నమ్మదగినవాళ్లు కాబట్టి దావీదు, దీర్ఘదర్శి+ సమూయేలు వాళ్లను ఆ పనుల్లో నియమించారు. 23  వాళ్లూ, వాళ్ల కుమారులూ యెహోవా మందిరం ద్వారాలకు అంటే గుడారం ద్వారాలకు కాపలా కాసేవాళ్లు.+ 24  ద్వారపాలకులు నాలుగు దిక్కుల్లో అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవాళ్లు.+ 25  అప్పుడప్పుడు, వాళ్లతో కలిసి ఏడురోజులు సేవచేయడానికి వాళ్ల సహోదరులు తమ పల్లెల నుండి రావాల్సి ఉంటుంది. 26  లేవీయులైన నలుగురు ప్రధాన* ద్వారపాలకులు సత్యదేవుని మందిరంలోని గదుల* మీద, ఖజానాల మీద అధికారులుగా నియమించబడ్డారు,+ ఎందుకంటే వాళ్లందరూ నమ్మకస్థులు. 27  వాళ్లు సత్యదేవుని మందిరం చుట్టూ తమతమ స్థానాల్లో నిలబడి, రాత్రంతా కాపలా కాసేవాళ్లు. ఎందుకంటే కాపలా కాసే బాధ్యత వాళ్లది, అంతేకాదు వాళ్ల దగ్గర తాళంచెవి ఉండేది; వాళ్లు ప్రతీరోజు ఉదయం మందిర తలుపులు తెరిచేవాళ్లు. 28  వాళ్లలో కొందరు సేవా పాత్రల్ని చూసుకునేవాళ్లు;+ ఆ పాత్రల్ని లోపలికి తీసుకొచ్చినప్పుడు, బయటికి తీసుకెళ్లినప్పుడు వాటిని లెక్కపెట్టేవాళ్లు. 29  వాళ్లలో కొంతమంది ఇతర పాత్రల మీద, పవిత్ర పాత్రలన్నిటి+ మీద, మెత్తని పిండి,+ ద్రాక్షారసం,+ నూనె,+ సాంబ్రాణి,+ సాంబ్రాణి తైలాల+ మీద నియమించబడ్డారు. 30  యాజకుల కుమారుల్లో కొంతమంది సాంబ్రాణి తైలంతో లేపనాన్ని తయారుచేసేవాళ్లు. 31  లేవీయుల్లో మత్తిత్యా నమ్మకస్థుడు కాబట్టి అతను పెనం మీద కాల్చేవాటి+ మీద అధికారిగా ఉండేవాడు. అతను కోరహు వంశస్థుడైన షల్లూము మొదటి కుమారుడు. 32  కహాతీయులైన వాళ్ల సహోదరుల్లో కొంతమంది సముఖపు రొట్టెల*+ మీద నియమించబడ్డారు, వాళ్లు ప్రతీ విశ్రాంతి రోజున* వాటిని తయారుచేసేవాళ్లు.+ 33  లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలైన వీళ్లు గాయకులు. వీళ్లు గదుల్లో* ఉండేవాళ్లు; వీళ్లు రాత్రింబగళ్లు తమ పనిలో నిమగ్నమై ఉండాలి కాబట్టి వేరే పనులు చేయాల్సిన అవసరం లేదు. 34  వంశావళి పట్టికల్లో నమోదుచేయబడిన ప్రకారం, వీళ్లు లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు, నాయకులు. వీళ్లు యెరూషలేములో నివసించారు. 35  గిబియోనుకు తండ్రైన యెహీయేలు గిబియోనులో+ నివసించాడు. అతని భార్య పేరు మయకా. 36  అతని మొదటి కుమారుడు అబ్దోను, మిగతావాళ్లు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37  గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు. 38  మిక్లోతు షిమ్యాను* కన్నాడు. వాళ్లందరూ యెరూషలేములో తమ సహోదరుల* దగ్గర నివసించారు. 39  నేరు+ కీషును కన్నాడు; కీషు సౌలును కన్నాడు;+ సౌలు యోనాతానును,+ మెల్కీషూవను,+ అబీనాదాబును,+ ఎష్బయలును కన్నాడు. 40  యోనాతాను మెరీబ్బయలును+ కన్నాడు. మెరీబ్బయలు మీకాను కన్నాడు.+ 41  మీకా కుమారులు: పీతోను, మెలెకు, తహ్రేయ, ఆహాజు. 42  ఆహాజు యరాను కన్నాడు; యరా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కన్నాడు. జిమ్రీ మోజాను కన్నాడు. 43  మోజా బిన్యాను కన్నాడు, బిన్యా రెఫాయాను కన్నాడు, రెఫాయా ఎలాశాను కన్నాడు, ఎలాశా ఆజేలును కన్నాడు. 44  ఆజేలుకు ఆరుగురు కుమారులు; వాళ్ల పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్లు ఆజేలు కుమారులు.

అధస్సూచీలు

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
లేదా “ఆలయ.”
లేదా “భోజనాల గదుల.”
అక్ష., “బలవంతులైన.”
లేదా “సన్నిధి రొట్టెల.”
లేదా “సబ్బాతు రోజున.”
లేదా “భోజనాల గదుల్లో.”
అక్ష., “షిమ్యామును.”
అంటే, తోటి బెన్యామీనీయులు.