దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6:1-81
6 లేవి కుమారులు: గెర్షోను, కహాతు,+ మెరారి.+
2 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు,+ హెబ్రోను, ఉజ్జీయేలు.+
3 అమ్రాము పిల్లలు:* అహరోను,+ మోషే,+ మిర్యాము.+ అహరోను కుమారులు: నాదాబు, అబీహు,+ ఎలియాజరు,+ ఈతామారు.+
4 ఎలియాజరు ఫీనెహాసును కన్నాడు;+ ఫీనెహాసు అబీషూవను కన్నాడు.
5 అబీషూవ బుక్కీని కన్నాడు; బుక్కీ ఉజ్జీని కన్నాడు.
6 ఉజ్జీ జెరహ్యాను కన్నాడు; జెరహ్యా మెరాయోతును కన్నాడు.
7 మెరాయోతు అమర్యాను కన్నాడు; అమర్యా అహీటూబును+ కన్నాడు.
8 అహీటూబు సాదోకును+ కన్నాడు; సాదోకు అహిమయస్సును+ కన్నాడు.
9 అహిమయస్సు అజర్యాను కన్నాడు; అజర్యా యోహానానును కన్నాడు.
10 యోహానాను అజర్యాను కన్నాడు. అతను యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో యాజకునిగా సేవచేశాడు.
11 అజర్యా అమర్యాను కన్నాడు; అమర్యా అహీటూబును కన్నాడు.
12 అహీటూబు సాదోకును+ కన్నాడు; సాదోకు షల్లూమును కన్నాడు.
13 షల్లూము హిల్కీయాను+ కన్నాడు; హిల్కీయా అజర్యాను కన్నాడు.
14 అజర్యా శెరాయాను+ కన్నాడు; శెరాయా యెహోజాదాకును+ కన్నాడు.
15 యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్లను, యెరూషలేమువాళ్లను బందీలుగా తీసుకెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
16 లేవి కుమారులు: గెర్షోము,* కహాతు, మెరారి.
17 గెర్షోము కుమారులు: లిబ్నీ, షిమీ.+
18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.+
19 మెరారి కుమారులు: మహలి, మూషి.
తమ పూర్వీకుల పేర్ల ప్రకారం లేవీయుల కుటుంబాలు ఇవి:+
20 గెర్షోము+ కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
21 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
22 కహాతు వంశస్థులు:* అతని కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు కోరహు,+ కోరహు కుమారుడు అస్సీరు,
23 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు,+ ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
24 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
25 ఎల్కానా కుమారులు: అమాశై, అహీమోతు.
26 ఇంకో ఎల్కానా వంశస్థులు: అతని కుమారుడు జోపై, జోపై కుమారుడు నహతు,
27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.+
28 సమూయేలు+ కుమారులు: మొదటి కుమారుడు యోవేలు, రెండో కుమారుడు అబీయా.+
29 మెరారి వంశస్థులు:* మహలి,+ మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా,
30 ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
31 మందసం* యెహోవా మందిరంలోకి వచ్చిన తర్వాత పాటలు పాడే విషయంలో నాయకత్వం వహించడానికి దావీదు వీళ్లను నియమించాడు.+
32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేంతవరకు,+ గుడారం దగ్గర అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర పాటలు పాడే బాధ్యత వాళ్లకు ఉండేది; వాళ్లకు నిర్దేశించబడినట్టు వాళ్లు సేవచేశారు.+
33 తమ కుమారులతో కలిసి అలా సేవచేసినవాళ్లు: కహాతీయుల్లో గాయకుడైన హేమాను;+ ఇతను యోవేలు+ కుమారుడు, యోవేలు సమూయేలు కుమారుడు,
34 సమూయేలు ఎల్కానా+ కుమారుడు, ఎల్కానా యెరోహాము కుమారుడు, యెరోహాము ఎలీయేలు కుమారుడు, ఎలీయేలు తోయహు కుమారుడు,
35 తోయహు సూపు కుమారుడు, సూపు ఎల్కానా కుమారుడు, ఎల్కానా మహతు కుమారుడు, మహతు అమాశై కుమారుడు,
36 అమాశై ఎల్కానా కుమారుడు, ఎల్కానా యోవేలు కుమారుడు, యోవేలు అజర్యా కుమారుడు, అజర్యా జెఫన్యా కుమారుడు,
37 జెఫన్యా తాహతు కుమారుడు, తాహతు అస్సీరు కుమారుడు, అస్సీరు ఎబ్యాసాపు కుమారుడు, ఎబ్యాసాపు కోరహు కుమారుడు,
38 కోరహు ఇస్హారు కుమారుడు, ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవి కుమారుడు, లేవి ఇశ్రాయేలు కుమారుడు.
39 హేమాను కుడిపక్కన అతని సహోదరుడైన ఆసాపు+ నిలబడి సేవచేశాడు; ఆసాపు బెరెక్యా కుమారుడు, బెరెక్యా షిమ్యా కుమారుడు,
40 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు,
41 మల్కీయా ఎత్నీ కుమారుడు, ఎత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,
42 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,
43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోము కుమారుడు, గెర్షోము లేవి కుమారుడు.
44 వాళ్ల సహోదరులైన మెరారి వంశస్థులు+ హేమాను ఎడమపక్కన నిలబడేవాళ్లు; వాళ్లలో ఏతాను+ ఒకడు; అతను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు,
45 మల్లూకు హషబ్యా కుమారుడు, హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
46 హిల్కీయా అమ్జీ కుమారుడు, అమ్జీ బానీ కుమారుడు, బానీ షెమెరు కుమారుడు,
47 షెమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
48 వాళ్ల సహోదరులైన లేవీయులు గుడారంలో, అంటే సత్యదేవుని మందిరంలో చేసే సేవ అంతటి కోసం నియమించబడ్డారు.*+
49 అహరోను, అతని కుమారులు+ సత్యదేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ దహనబలుల్ని అర్పించే బలిపీఠం+ మీద బలులు అర్పిస్తూ, ధూపవేదిక మీద ధూపద్రవ్యం కాలుస్తూ పొగ పైకిలేచేలా చేసేవాళ్లు,+ అతి పవిత్రమైన విషయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించేవాళ్లు.
50 అహరోను+ వంశస్థులు: అతని కుమారుడు ఎలియాజరు;+ ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,
51 అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్యా,
52 జెరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,+
53 అహీటూబు కుమారుడు సాదోకు,+ సాదోకు కుమారుడు అహిమయస్సు.
54 వాళ్లు తమ ప్రాంతంలో ఈ స్థలాల్లో శిబిరాలు* వేసుకున్నారు: కహాతీయుల కుటుంబానికి చెందిన అహరోను వంశస్థులకు మొదటి చీటి* పడింది కాబట్టి,
55 వాళ్లకు యూదా ప్రాంతంలో హెబ్రోను, దాని చుట్టుపక్కల పచ్చికబయళ్లు ఇచ్చారు.+
56 అయితే ఆ నగర పొలాల్ని, దాని పల్లెల్ని యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇచ్చారు.+
57 అహరోను వంశస్థులకు ఆశ్రయపురాలైన*+ హెబ్రోను;+ లిబ్నా,+ దాని పచ్చికబయళ్లు; యత్తీరు;+ ఎష్టెమోయ, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;+
58 అలాగే హీలేను, దాని పచ్చికబయళ్లు; దెబీరు,+ దాని పచ్చికబయళ్లు;
59 ఆషాను,+ దాని పచ్చికబయళ్లు; బేత్షెమెషు,+ దాని పచ్చికబయళ్లు;
60 బెన్యామీను గోత్రంలో నుండి గెబా,+ దాని పచ్చికబయళ్లు; ఆలెమెతు, దాని పచ్చికబయళ్లు; అనాతోతు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు. వాళ్ల వంశస్థులకు మొత్తం 13 నగరాలు ఇచ్చారు.+
61 మిగతా కహాతీయులకు వేరే గోత్రాలకు చెందిన కుటుంబాల నుండి, మనష్షే అర్ధగోత్రం నుండి పది నగరాలు కేటాయించారు.*+
62 గెర్షోమీయులకు, వాళ్ల కుటుంబాలకు ఇశ్శాఖారు గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, నఫ్తాలి గోత్రంలో నుండి, బాషానులో మనష్షే గోత్రంలో నుండి 13 నగరాలు కేటాయించారు.+
63 మెరారీయులకు, వాళ్ల కుటుంబాలకు రూబేను గోత్రంలో నుండి, గాదు గోత్రంలో నుండి, జెబూలూను గోత్రంలో నుండి 12 నగరాల్ని చీటి వేసి కేటాయించారు.+
64 అలా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఆ నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఇచ్చారు.+
65 అంతేకాదు వాళ్లు చీటి వేసి, యూదా గోత్రంలో నుండి, షిమ్యోను గోత్రంలో నుండి, బెన్యామీను గోత్రంలో నుండి నగరాల్ని ఇచ్చారు; ఆ నగరాల పేర్లు ప్రస్తావించబడ్డాయి.
66 కహాతీయుల కుటుంబాలు కొన్ని, ఎఫ్రాయిము గోత్రంలో నుండి నగరాల్ని తమ ప్రాంతంగా పొందాయి.+
67 ఆ కుటుంబాలకు ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న ఆశ్రయపురాలైన* షెకెము, దాని పచ్చికబయళ్లు; గెజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు,
68 అలాగే యొక్మెయాము, దాని పచ్చికబయళ్లు; బేత్-హోరోను,+ దాని పచ్చికబయళ్లు;
69 అయ్యాలోను,+ దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;
70 కహాతీయుల మిగతా కుటుంబాలకు మనష్షే అర్ధగోత్రంలో నుండి ఆనేరు, దాని పచ్చికబయళ్లు; బిలియాము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
71 వాళ్లు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రపు కుటుంబం నుండి బాషానులోని గోలాను,+ దాని పచ్చికబయళ్లు; అష్తారోతు, దాని పచ్చికబయళ్లు కేటాయించారు;+
72 ఇశ్శాఖారు గోత్రంలో నుండి కెదెషు, దాని పచ్చికబయళ్లు; దాబెరతు,+ దాని పచ్చికబయళ్లు;+
73 రామోతు, దాని పచ్చికబయళ్లు; ఆనేము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;
74 ఆషేరు గోత్రంలో నుండి మాషాలు, దాని పచ్చికబయళ్లు; అబ్దోను, దాని పచ్చికబయళ్లు;+
75 హుక్కోకు, దాని పచ్చికబయళ్లు; రెహోబు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;
76 నఫ్తాలి గోత్రంలో నుండి గలిలయలోని+ కెదెషు,+ దాని పచ్చికబయళ్లు; హమ్మోను, దాని పచ్చికబయళ్లు; కిర్యతాయిము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
77 వాళ్లు మెరారీయుల్లో మిగతావాళ్లకు జెబూలూను గోత్రంలో+ నుండి రిమ్మోనో, దాని పచ్చికబయళ్లు; తాబోరు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;
78 యెరికో దగ్గర యొర్దాను ప్రాంతంలో, యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతంలో, రూబేను గోత్రంలో నుండి వాళ్లకు ఎడారిలో ఉన్న బేసెరు, దాని పచ్చికబయళ్లు; యాహజు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు,
79 కెదేమోతు,+ దాని పచ్చికబయళ్లు; మేఫాతు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు;
80 గాదు గోత్రంలో నుండి గిలాదులోని రామోతు, దాని పచ్చికబయళ్లు; మహనయీము,+ దాని పచ్చికబయళ్లు;
81 హెష్బోను,+ దాని పచ్చికబయళ్లు; యాజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు.
అధస్సూచీలు
^ అక్ష., “కుమారులు.”
^ 1వ వచనంలో గెర్షోను అని కూడా పిలవబడ్డాడు.
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ లేదా “పెద్దపెట్టె.”
^ అక్ష., “ఇవ్వబడ్డారు.”
^ లేదా “ప్రాకారాలుగల శిబిరాలు.”
^ లేదా యెహోషువ 21:13 అనుగుణంగా, “ఆశ్రయపురమైన” అయ్యుంటుంది.
^ లేదా “చీటి వేసి ఇచ్చారు.”
^ లేదా యెహోషువ 21:21 అనుగుణంగా, “ఆశ్రయపురమైన” అయ్యుంటుంది.