దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 23:1-32
23 దావీదు ముసలివాడై, మరణానికి దగ్గరపడినప్పుడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజును చేశాడు.+
2 అప్పుడు దావీదు ఇశ్రాయేలు అధిపతులందర్నీ, యాజకుల్ని,+ లేవీయుల్ని+ సమకూర్చాడు.
3 30 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు లెక్కించబడ్డారు;+ వాళ్ల సంఖ్య 38,000.
4 వాళ్లలో 24,000 మంది యెహోవా మందిర పనిని పర్యవేక్షించేవాళ్లు; 6,000 మంది అధికారులుగా, న్యాయమూర్తులుగా ఉండేవాళ్లు;+
5 4,000 మంది ద్వారపాలకులుగా+ ఉండేవాళ్లు. అంతేకాక, 4,000 మంది దేవుణ్ణి స్తుతించడానికి దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్లు.+
6 తర్వాత దావీదు, లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశస్థుల ప్రకారం వాళ్లను విభాగాలుగా వ్యవస్థీకరించాడు.*+
7 గెర్షోనీయుల్లో నుండి లద్దాను, షిమీ.
8 లద్దాను కుమారులు వీళ్లు: అధిపతైన యెహీయేలు, జేతాము, యోవేలు;+ మొత్తం ముగ్గురు.
9 షిమీ కుమారులు వీళ్లు: షెలోమోతు, హజీయేలు, హారాను; మొత్తం ముగ్గురు. వీళ్లు లద్దాను పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు.
10 షిమీ కుమారులు వీళ్లు: యహతు, జీనా, యూషు, బెరీయా. ఈ నలుగురు షిమీ కుమారులు.
11 వాళ్లలో యహతు అధిపతి, రెండోవాడు జీజా. అయితే యూషుకు, బెరీయాకు ఎక్కువమంది పిల్లలు లేరు కాబట్టి వాళ్లు ఒకే పూర్వీకుల కుటుంబంగా లెక్కించబడ్డారు. వాళ్లకు ఒకే పని అప్పగించబడింది.
12 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు,+ హెబ్రోను, ఉజ్జీయేలు;+ మొత్తం నలుగురు.
13 అమ్రాము కుమారులు: అహరోను,+ మోషే.+ అయితే అతి పవిత్ర స్థలాన్ని ప్రతిష్ఠించడానికి, యెహోవా ఎదుట బలులు అర్పించడానికి, ఆయనకు సేవ చేయడానికి, ఆయన పేరున ఎల్లప్పుడూ ప్రజల్ని ఆశీర్వదించడానికి+ అహరోనూ అతని కుమారులూ శాశ్వతంగా ప్రత్యేకపర్చబడ్డారు.+
14 సత్యదేవుని సేవకుడైన మోషే విషయానికొస్తే, అతని కుమారులు లేవీయుల గోత్రంవాళ్ల మధ్య లెక్కించబడ్డారు.
15 మోషే కుమారులు: గెర్షోము,+ ఎలీయెజెరు.+
16 గెర్షోము కుమారుల్లో షెబూయేలు+ అధిపతి.
17 ఎలీయెజెరు వంశస్థుల్లో* రెహబ్యా+ అధిపతి; ఎలీయెజెరుకు కుమారులు ఇంకెవ్వరూ లేరు, కానీ రెహబ్యా కుమారులు మాత్రం చాలామంది ఉన్నారు.
18 ఇస్హారు కుమారుల్లో+ షెలోమీతు+ అధిపతి.
19 హెబ్రోను కుమారులు వీళ్లు: అధిపతైన యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాము.+
20 ఉజ్జీయేలు కుమారుల్లో+ మీకా అధిపతి, రెండోవాడు ఇష్షీయా.
21 మెరారి కుమారులు: మహలి, మూషి.+ మహలి కుమారులు: ఎలియాజరు, కీషు.
22 ఎలియాజరు చనిపోయాడు, అతనికి కూతుళ్లే గానీ కుమారులు లేరు. కాబట్టి వాళ్లను వాళ్ల బంధువులైన* కీషు కుమారులు పెళ్లి చేసుకున్నారు.
23 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరేమోతు; మొత్తం ముగ్గురు.
24 వీళ్లు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం, పూర్వీకుల కుటుంబ పెద్దల ప్రకారం నమోదు చేయబడిన లేవి వంశస్థులు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు తమ పేర్ల ప్రకారం యెహోవా మందిరంలో సేవ చేయడానికి లెక్కించబడ్డారు, పట్టికలో నమోదు చేయబడ్డారు.
25 ఎందుకంటే దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు విశ్రాంతి ఇచ్చాడు,+ ఆయన యెరూషలేములో ఎప్పటికీ నివసిస్తాడు.+
26 అంతేకాదు, లేవీయులు గుడారాన్ని గానీ సేవ కోసం ఉపయోగించే దాని ఉపకరణాల్ని గానీ మోయాల్సిన అవసరం లేదు.”+
27 దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు లెక్కించబడ్డారు.
28 యెహోవా మందిర సేవలో అహరోను కుమారులకు+ సహాయం చేయడం, ప్రాంగణాల్ని,+ భోజనాల గదుల్ని చూసుకోవడం, పవిత్రమైన ప్రతీదాన్ని శుద్ధి చేయడం, సత్యదేవుని మందిర సేవకు అవసరమైన ఏ పనినైనా చూసుకోవడం లేవీయుల బాధ్యత.
29 అంతేకాదు సముఖపు రొట్టెలు,*+ ధాన్యార్పణ కోసం మెత్తని పిండి, పులవని పిండితో చేసే అప్పడాలు,+ పెనం మీద కాల్చే రొట్టెలు, నూనెతో కలిపిన పిండి,+ అలాగే అన్ని పరిమాణాలకు, కొలతలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు సహాయం చేసేవాళ్లు.
30 వాళ్లు ప్రతీరోజు ఉదయం+ అలాగే సాయంత్రం నిలబడి యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలి.+
31 ధర్మశాస్త్రంలో రాయబడినదాని ప్రకారం విశ్రాంతి రోజుల్లో,+ అమావాస్య రోజుల్లో,+ అలాగే పండుగ సమయాల్లో+ యెహోవాకు దహనబలుల్ని అర్పించినప్పుడల్లా వాళ్లు సహాయం చేసేవాళ్లు; వాళ్లు యెహోవా ముందు క్రమంగా ఆ పని చేసేవాళ్లు.
32 అంతేకాదు ప్రత్యక్ష గుడారానికి, పవిత్ర స్థలానికి సంబంధించిన సేవ చేసేవాళ్లు. అలాగే యెహోవా మందిరంలో తమ సహోదరులకు, అంటే అహరోను కుమారులకు సహాయం చేసేవాళ్లు.
అధస్సూచీలు
^ లేదా “విభజించాడు.”
^ అక్ష., “కుమారుల్లో.”
^ అక్ష., “సహోదరులైన.”
^ లేదా “సన్నిధి రొట్టెలు.”