దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22:1-19

  • దావీదు ఆలయం కోసం అవసరమైనవి సిద్ధం చేయడం (1-5)

  • దావీదు సొలొమోనుకు నిర్దేశాలు ఇవ్వడం (6-16)

  • సొలొమోనుకు సహాయం చేయమని అధిపతులకు ఆజ్ఞాపించడం (17-19)

22  తర్వాత దావీదు ఇలా అన్నాడు: “ఇది సత్యదేవుడైన యెహోవా మందిరం, ఇది ఇశ్రాయేలీయులు దహనబలులు అర్పించే బలిపీఠం.”+  అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశంలో ఉన్న పరదేశుల్ని+ ఒకచోట పోగుచేయమని ఆజ్ఞాపించాడు; అతను వాళ్లను సత్యదేవుని మందిర నిర్మాణం కోసం రాళ్లను తొలిచి, వాటిని చెక్కే పనిలో పెట్టాడు.+  ద్వారాల తలుపులకు కావాల్సిన మేకుల కోసం, బందుల కోసం పెద్ద మొత్తంలో ఇనుమును, అలాగే రాగిని కూడా దావీదు సిద్ధం చేశాడు; ఆ రాగి, తూకం వేయలేనంత విస్తారంగా ఉంది.+  వాటితోపాటు అతను లెక్కలేనన్ని దేవదారు మ్రానుల్ని+ సిద్ధం చేశాడు. ఎందుకంటే సీదోనీయులు,+ తూరువాళ్లు+ పెద్ద మొత్తంలో దేవదారు మ్రానుల్ని దావీదు దగ్గరికి తెచ్చారు.  దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడు సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు;*+ యెహోవా కోసం కట్టబోయే మందిరం చాలా వైభవంగా ఉండాలి,+ దాని పేరుప్రఖ్యాతుల గురించి, దాని అందం గురించి+ దేశాలన్నిట్లో తెలియాలి.+ కాబట్టి నేను అతనికి అవసరమైనవి సిద్ధం చేస్తాను.” అలా దావీదు తాను చనిపోకముందు పెద్ద మొత్తంలో వస్తువుల్ని సిద్ధం చేశాడు.  అంతేకాదు దావీదు తన కుమారుడు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోసం ఒక మందిరాన్ని కట్టమని ఆదేశించాడు.  దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా అన్నాడు: “నా దేవుడైన యెహోవా పేరు కోసం ఒక మందిరాన్ని కట్టాలనేది నా హృదయ కోరిక.+  కానీ యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: ‘నువ్వు చాలా రక్తం చిందించావు, పెద్దపెద్ద యుద్ధాలు చేశావు. నువ్వు నా ఎదుట భూమ్మీద ఎంతో రక్తాన్ని చిందించావు కాబట్టి నా పేరు కోసం ఒక మందిరాన్ని నువ్వు కట్టవు.+  ఇదిగో! నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను శాంతిపరుడిగా* ఉంటాడు; నేను అతని చుట్టూ ఉన్న శత్రు​వులందరి నుండి అతనికి విశ్రాంతి ఇస్తాను;+ అతని పేరు సొలొమోను* అని పిలవబడుతుంది, నేను అతని రోజుల్లో ఇశ్రాయేలుకు శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తాను.+ 10  అతనే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు.+ అతను నాకు కుమారుడు అవుతాడు, నేను అతనికి తండ్రిని అవుతాను.+ నేను ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.’+ 11  “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండాలి; ఆయన నీ గురించి చెప్పినట్టు, నీ దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టడంలో నువ్వు సఫలం అవ్వాలి.+ 12  యెహోవా నీకు ఇశ్రాయేలు మీద అధికారం ఇచ్చినప్పుడు, నువ్వు నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించేలా ఆయన నీకు బుద్ధిని, అవగాహనను ఇవ్వాలి;+ 13  యెహోవా ఇశ్రాయేలుకు ఇవ్వమని మోషేకు ఆజ్ఞాపించిన నియమాల్ని, తీర్పుల్ని నువ్వు జాగ్రత్తగా పాటిస్తే,+ విజయం సాధిస్తావు.+ ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, బెదిరిపోకు.+ 14  ఇదిగో నేను ఎంతో ప్రయాసపడి యెహోవా మందిరం కోసం 1,00,000 తలాంతుల* బంగారాన్ని, 10,00,000 తలాంతుల వెండిని, చాలా విస్తారంగా రాగిని, ఇనుమును సిద్ధం చేశాను,+ వాటిని తూకం వేయడం సాధ్యం కాదు; నేను మ్రానుల్ని, రాళ్లను కూడా సిద్ధం చేశాను;+ నువ్వు వాటితోపాటు మరికొన్ని సమకూర్చు. 15  పెద్ద సంఖ్యలో పనివాళ్లు, అంటే రాళ్లు కొట్టేవాళ్లు, తాపీ పనివాళ్లు,+ వడ్రంగులు, అన్నిరకాల నైపుణ్యాలు ఉన్న పనివాళ్లు+ నీ దగ్గర ఉన్నారు. 16  లెక్కించలేనంత బంగారం, వెండి, రాగి, ఇనుము ఉన్నాయి. నువ్వు లేచి పని మొదలుపెట్టు, యెహోవా నీకు తోడుగా ఉండాలి.”+ 17  తర్వాత దావీదు, తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయమని ఇశ్రాయేలు అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు, అతనిలా చెప్పాడు: 18  “మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కదా? ఆయన అన్నివైపులా మీకు విశ్రాంతి ఇచ్చాడు కదా? దేశ నివాసుల్ని ఆయన నా చేతికి అప్పగించాడు; దేశం యెహోవా, ఆయన ప్రజల ఆధిపత్యం కిందికి వచ్చింది. 19  ఇప్పుడు మీరు నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* మీ దేవుడైన యెహోవాను వెదకాలని నిశ్చయించుకోండి;+ యెహోవా ఒప్పంద మందసాన్ని, సత్యదేవుని పవిత్రమైన పాత్రల్ని యెహోవా పేరు కోసం కట్టబడే మందిరంలోకి+ తెచ్చేలా+ సత్యదేవుడైన యెహోవా పవిత్రమైన స్థలాన్ని కట్టడం మొదలుపెట్టండి.”+

అధస్సూచీలు

లేదా “కోమలమైనవాడు.”
అక్ష., “విశ్రాంతిపరుడిగా.”
“శాంతి” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
పదకోశం చూడండి.