సామెతలు 9:1-18

  • నిజమైన తెలివి పిలుస్తోంది (1-12)

    • “నా వల్ల నీ ఆయుష్షు పెరుగుతుంది” (11)

  • మూర్ఖురాలు పిలుస్తోంది (13-18)

    • “దొంగిలించిన నీళ్లు తీపి” (17)

9  నిజమైన తెలివి తన ఇల్లు కట్టుకుంది;ఏడు స్తంభాలు చెక్కుకుంది.   తన పశువును వధించింది;ద్రాక్షారసాన్ని కలిపింది;బల్లను కూడా సిద్ధం చేసింది.   అది, నగరం ఎత్తైన స్థలాల్లో నుండి ఇలా చాటించమని+తన సేవకురాళ్లను పంపింది:   “అనుభవంలేని వాళ్లంతా ఇక్కడికి రావాలి.” వివేచన లేనివాళ్లతో ఆమె ఇలా చెప్పింది:   “రండి, నేను సిద్ధం చేసిన రొట్టె తినండి,నేను కలిపిన ద్రాక్షారసం తాగండి.   జీవించాలనుకుంటే, అనుభవంలేని వాళ్లుగా ఉండకండి;+అవగాహనా మార్గంలో ముందుకు సాగండి.”+   ఎగతాళి చేసేవాణ్ణి సరిదిద్దేవాడు నవ్వులపాలు అవుతాడు,+దుష్టుణ్ణి గద్దించేవాడు అవమానం కొనితెచ్చుకుంటాడు.   ఎగతాళి చేసేవాణ్ణి సరిదిద్దకు, అలాచేస్తే అతను నిన్ను ద్వేషిస్తాడు.+ తెలివిగలవాణ్ణి గద్దించు, అతను నిన్ను ప్రేమిస్తాడు.+   తెలివిగలవాడికి ఉపదేశం ఇవ్వు, అతను ఇంకా తెలివిగలవాడు అవుతాడు.+ నీతిమంతునికి బోధించు, అతను నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటాడు. 10  యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం,అతి పవిత్రుడైన దేవుని గురించి తెలుసుకోవడమే+ అవగాహన. 11  నా వల్ల నీ ఆయుష్షు పెరుగుతుంది,+నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు. 12  నువ్వు తెలివిగల వాడివైతే, దానివల్ల నీకే లాభం,కానీ నువ్వు ఎగతాళిచేసే వాడివైతే, ఆ పర్యవసానాలు నువ్వే అనుభవిస్తావు. 13  మూర్ఖురాలు గట్టిగా మాట్లాడుతుంది. ఆమెకు తెలివి ఉండదు, అస్సలు ఏమీ తెలీదు. 14  నగరంలోని ఎత్తైన స్థలాల్లో,ఆమె తన ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని,+ 15  అటుగా వెళ్లేవాళ్లతో,తమ దారిలో తిన్నగా నడుచుకుంటూ వెళ్లేవాళ్లతో ఇలా అంటుంది: 16  “అనుభవంలేని వాళ్లంతా ఇక్కడికి రావాలి.” వివేచన లేనివాళ్లతో+ ఆమె ఇలా అంటుంది: 17  “దొంగిలించిన నీళ్లు తీపి,చాటుగా తిన్న ఆహారం రుచి.”+ 18  అయితే ఆమె ఇల్లు చనిపోయినవాళ్లతో నిండివుందని,ఆమె అతిథులు సమాధి* లోతుల్లో ఉన్నారని+ వాళ్లకు తెలీదు.

అధస్సూచీలు

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.