సామెతలు 8:1-36

  • తెలివి మాట్లాడుతోంది (1-36)

    • ‘దేవుని పనుల్లో నేను మొట్టమొదటి వాణ్ణి ’ (22)

    • ‘ప్రధానశిల్పిగా దేవుని పక్కన’ (30)

    • ‘మనుషుల్ని బట్టి ఆనందించేవాణ్ణి’ (31)

8  తెలివి గొంతెత్తి పిలుస్తోంది, వివేచన బిగ్గరగా మాట్లాడుతోంది.+   అది దారి పక్కన ఎత్తైన స్థలాల్లో,+కూడళ్ల దగ్గర నిలబడి ఉంది.   నగర ద్వారాల పక్కన, తలుపుల దగ్గరఅది బిగ్గరగా ఇలా అంటోంది:+   “ప్రజలారా, మీకే చెప్తున్నాను;మీలో ప్రతీ ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను.   అనుభవంలేని వాళ్లారా, వివేకం* ​సంపాదించండి;+మూర్ఖులారా, అవగాహనగల హృదయం సంపాదించుకోండి.   నేను చెప్పే విషయాలు వినండి, అవి చాలా ముఖ్యమైనవి,నా పెదాలు సరైన మాటలే ​మాట్లాడతాయి;   నా నోరు సత్యమే చెప్తుంది,నా పెదాలకు చెడు అసహ్యం.   నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో వంకర మాటలు గానీ, కుటిల మాటలు గానీ లేవు.   నా మాటలన్నీ వివేచన గలవాళ్లకు సూటిగా,జ్ఞానం పొందినవాళ్లకు సరైనవిగా అనిపిస్తాయి. 10  వెండికి బదులు నేనిచ్చే క్రమశిక్షణను,మేలిమి బంగారానికి బదులు జ్ఞానాన్ని ఎంచుకోండి,+ 11  ఎందుకంటే, పగడాల* కంటే తెలివి ​విలువైనది;అమూల్యమైనవేవీ దానికి సాటిరావు. 12  తెలివి అనే నేను వివేకంతో* కలిసి ​నివసిస్తాను;జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం+ నా దగ్గర ఉన్నాయి. 13  యెహోవాకు భయపడడం అంటే చెడును అసహ్యించుకోవడమే.+ తనను తాను హెచ్చించుకోవడం, గర్వం,+ చెడ్డ మార్గం, తప్పుడు మాటలు+ నాకు అసహ్యం. 14  మంచి సలహా, ఆచరణాత్మక తెలివి+ నా దగ్గర ఉన్నాయి;అవగాహన,+ బలం+ నా సొంతం. 15  నా సహాయంతో రాజులు పరిపాలిస్తారు,ఉన్నతాధికారులు నీతిగల+ చట్టాలు చేస్తారు. 16  నా సహాయంతో అధిపతులు ఏలతారు,ప్రముఖులు నీతిగా తీర్పు తీరుస్తారు. 17  నన్ను ప్రేమించేవాళ్లను నేను ప్రేమిస్తాను,నన్ను వెదికేవాళ్లకు దొరుకుతాను.+ 18  ఐశ్వర్యం, ఘనత,శాశ్వత సంపదలు,* నీతి నా దగ్గర ఉన్నాయి. 19  నేను ఇచ్చేవి బంగారం కన్నా, స్వచ్ఛమైన బంగారం కన్నా మేలైనవి,నా బహుమతులు శ్రేష్ఠమైన వెండికన్నా మెరుగైనవి.+ 20  నీతి మార్గంలో,న్యాయమార్గాల మధ్యలో నేను నడుస్తాను; 21  నన్ను ప్రేమించేవాళ్లకు నేను నిజమైన సంపదల్ని ఇస్తాను,వాళ్ల గోదాముల్ని నింపుతాను. 22  యెహోవా తన సృష్టికార్యాల్లో మొదటిదిగా నన్ను చేశాడు,+పూర్వం తన పనుల్లో మొట్టమొదటిదిగా నన్ను తయారుచేశాడు.+ 23  ప్రాచీనకాలాల్లో,* మొదట్లో,భూమిని చేయకముందే+ నేను నియమించబడ్డాను.+ 24  అగాధ జలాలు+ లేనప్పుడు,నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను.* 25  పర్వతాల్ని వాటి స్థానంలో ఉంచకముందే,కొండలు ఉనికిలోకి రాకముందే నేను పుట్టాను, 26  అప్పటికి ఆయన ఇంకా భూమిని గానీ, దాని మైదానాల్ని గానీ,పిడికెడు నేల మట్టిని గానీ చేయలేదు. 27  ఆయన ఆకాశాన్ని సిద్ధం చేసినప్పుడు+ నేను ఉన్నాను;జలాల ఉపరితలం మీద ఆయన ​సరిహద్దు రేఖను* గీసినప్పుడు,+ 28  పైన మేఘాల్ని స్థిరపర్చినప్పుడు,లోతైన సముద్రాల్ని నింపినప్పుడు, 29  సముద్రానికి సరిహద్దుల్ని పెట్టిదాని నీళ్లు ఆ హద్దుల్ని దాటకూడదని ఆయన ఆజ్ఞాపించినప్పుడు,+భూమి పునాదుల్ని స్థాపించినప్పుడు, 30  నేను ప్రధానశిల్పిగా* ఆయన పక్కనే ఉన్నాను.+ ఆయన ప్రతీరోజు నన్ను చూసి ఎంతో సంతోషించేవాడు;+నేను ఎప్పుడూ ఆయన ముందు ​సంతోషిస్తూ ఉండేవాణ్ణి.+ 31  మనుషులు నివసించగలిగేలా ఆయన చేసిన భూమిని చూసి నేను సంతోషించాను,ముఖ్యంగా మనుషుల్ని* బట్టి నేను ఎంతో ఆనందించేవాణ్ణి. 32  కాబట్టి నా కుమారులారా, ఇప్పుడు నేను చెప్పేది వినండి;నా మార్గాల్లో నడిచేవాళ్లు సంతోషంగా ఉంటారు. 33  క్రమశిక్షణను స్వీకరించి+ తెలివిగలవాళ్లు అవ్వండి,దాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి. 34  ప్రతీరోజు తెల్లవారుజామునే నా గడప దగ్గరికి వస్తూ,నా గుమ్మం దగ్గర కనిపెట్టుకొనివుంటూ,నా మాటలు వినేవాళ్లు సంతోషంగా ఉంటారు; 35  ఎందుకంటే, నన్ను కనుగొన్నవాళ్లు జీవాన్ని కనుగొంటారు,+యెహోవా ఆమోదం పొందుతారు. 36  నన్ను పట్టించుకోనివాళ్లు తమకు తామే హాని చేసుకుంటారు,నన్ను ద్వేషించేవాళ్లు మరణాన్ని ప్రేమిస్తున్నారు.”+

అధస్సూచీలు

లేదా “యుక్తి.”
పదకోశం చూడండి.
లేదా “యుక్తితో.”
లేదా “వారసత్వ విలువలు.”
లేదా “అనాదికాలంలో.”
లేదా “పురిటినొప్పులతో కన్నట్టు నేను కలగజేయబడ్డాను.”
అక్ష., “వృత్తాన్ని.”
లేదా “నైపుణ్యంగల పనివానిగా.”
లేదా “మానవజాతిని.”