సామెతలు 6:1-35

  • అప్పుకు హామీ ఉండే విషయంలో జాగ్రత్త (1-5)

  • “సోమరీ, చీమల దగ్గరికి వెళ్లు” (6-11)

  • పనికిమాలిన దుష్టుడు (12-15)

  • యెహోవా ద్వేషించే ఏడు విషయాలు (16-19)

  • చెడ్డ స్త్రీ విషయంలో జాగ్రత్త (20-35)

6  నా కుమారుడా, నీ పొరుగువాడికి నువ్వు హామీగా* ఉంటే,+అపరిచితునితో ఒప్పందం చేసుకునివుంటే,+   ఇచ్చిన మాటవల్ల నువ్వు చిక్కుకుపోతే,నీ నోటి మాటలవల్ల ఇరుక్కుపోతే,+   నా కుమారుడా, ఇలా చేసి తప్పించుకో:వెళ్లి, నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ పొరుగువాణ్ణి పదేపదే బ్రతిమాలు. ఎందుకంటే నువ్వు నీ పొరుగువాడి చేతికి చిక్కావు.+   నీ కంటికి నిద్ర గానీ,నీ కనురెప్పలకు కునుకు గానీ రానివ్వకు.   వేటగాడి చేతిలో నుండి కొండజింక,బోయవాడి చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.   సోమరీ,+ చీమల దగ్గరికి వెళ్లు;అవి చేసే పనులు చూసి తెలివి తెచ్చుకో.   వాటికి సైన్యాధికారి గానీ, అధికారి గానీ, పరిపాలకుడు గానీ లేకపోయినా,   అవి వేసవికాలంలో ఆహారం సిద్ధం చేసుకుంటాయి,+కోతకాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.   సోమరీ, ఎంతసేపు నువ్వు పడుకొని ఉంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు? 10  కాసేపు నిద్రపోవడం, కాసేపు కునికిపాట్లు పడడం,కాసేపు చేతులు ముడుచుకొని పడుకోవడం+ 11  వాటివల్ల, దోపిడీ దొంగలా పేదరికం,ఆయుధాలు ధరించిన మనిషిలా లేమి నీ మీదికి వస్తాయి.+ 12  పనికిమాలిన దుష్టుడు వంకర మాటలు మాట్లాడుతూ తిరుగుతుంటాడు;+ 13  అతను కన్ను గీటి,+ కాళ్లతో, వేళ్లతో సైగలు చేస్తాడు. 14  కపట హృదయంతో అతను ఎప్పుడూకుట్రలు పన్నుతూ,+ గొడవలు పెడుతూ+ ఉంటాడు. 15  కాబట్టి అకస్మాత్తుగా అతని మీదికి విపత్తు వస్తుంది;అతను ఒక్క క్షణంలో కూలిపోతాడు, మళ్లీ కోలుకోడు.+ 16  యెహోవా ద్వేషించేవి ఆరు ఉన్నాయి;నిజానికి ఏడు విషయాల్ని ఆయన అసహ్యించుకుంటాడు, అవేంటంటే: 17  అహంకారంతో నిండిన కళ్లు,+ అబద్ధాలాడే నాలుక,+ అమాయకుల రక్తం చిందించే చేతులు,+ 18  కుట్రలు పన్నే హృదయం,+ కీడు చేయడానికి పరుగులు తీసే పాదాలు, 19  నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పే దొంగ సాక్షి,+సహోదరుల మధ్య గొడవలు పెట్టేవాడు.+ 20  నా కుమారుడా, మీ నాన్న ఆజ్ఞను పాటించు,మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెట్టకు.+ 21  వాటిని ఎప్పుడూ నీ హృదయంలో ఉంచుకో;నీ మెడకు కట్టుకో. 22  నువ్వు నడుస్తున్నప్పుడు అవి నీకు దారి చూపిస్తాయి;నువ్వు పడుకున్నప్పుడు నీకు కాపలా కాస్తాయి;నువ్వు మేల్కొని ఉన్నప్పుడు నీతో మాట్లాడతాయి.* 23  ఎందుకంటే ఆజ్ఞ దీపం,+ఉపదేశం వెలుగు;గద్దింపు, క్రమశిక్షణ జీవానికి నడిపిస్తాయి.+ 24  అవి నిన్ను చెడ్డ స్త్రీ నుండి,అనైతిక* స్త్రీ మాట్లాడే మాయమాటల నుండి కాపాడతాయి.+ 25  ఆమె సౌందర్యాన్ని నీ హృదయంలో ఆశించకు,+తన అందమైన కళ్లతో నిన్ను కట్టిపడేయనివ్వకు; 26  ఎందుకంటే, వేశ్య వల్ల చివరికి రొట్టె ముక్క మాత్రమే మిగులుతుంది,+వ్యభిచార ప్రవృత్తి గల స్త్రీ అమూల్యమైన ప్రాణాన్ని వేటాడుతుంది. 27  ఒడిలో నిప్పులు ఉంచుకుంటే బట్టలు కాలిపోకుండా ఉంటాయా?+ 28  నిప్పుల మీద నడిస్తే కాళ్లు కాలకుండా ఉంటాయా? 29  తన పొరుగువాడి భార్యతో సంబంధాలు పెట్టుకునే వ్యక్తి పరిస్థితి అలాగే ఉంటుంది;ఆమెను ముట్టుకునేవాడికి శిక్ష తప్పదు.+ 30  ఆకలిగా ఉన్న దొంగ కడుపు నింపుకోవడానికి దొంగతనం చేస్తే,ఎవరూ అతన్ని నీచంగా చూడరు. 31  కానీ, అతను దొరికితే ఏడంతలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది;తన ఇంట్లోని విలువైన వాటన్నిటినీ ఇచ్చేయాల్సి వస్తుంది.+ 32  వ్యభిచారం చేసేవాడు వివేచన లేనివాడు;అతను తన మీదికి తానే నాశనం కొనితెచ్చుకుంటాడు.+ 33  అతనికి గాయాలు, తలవంపులే మిగులుతాయి,+అతని అవమానం తొలగిపోదు.+ 34  ఎందుకంటే, రోషం వల్ల భర్తకు విపరీతమైన కోపం వస్తుంది;ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతను ఏమాత్రం కనికరం చూపించడు.+ 35  అతను ఎలాంటి పరిహారం* అంగీకరించడు;నువ్వు ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా అతను శాంతించడు.

అధస్సూచీలు

అక్ష., “జామీను.”
లేదా “నీకు ఉపదేశిస్తాయి.”
అక్ష., “విదేశీ.” సామెతలు 2:16 చూడండి.
లేదా “విమోచనా మూల్యం.”