సామెతలు 28:1-28

  • ధర్మశాస్త్రానికి స్పందించని వాళ్ల ప్రార్థన అసహ్యం (9)

  • దోషాన్ని ఒప్పుకునేవాడి మీద కరుణ (13)

  • ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు (20)

  • పొగడ్త కన్నా గద్దింపు మేలు (23)

  • ఉదారంగా ఇచ్చేవాడికి ఏ లోటూ ఉండదు (27)

28  ఎవరూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు,నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడు.+   దేశ ప్రజలు అపరాధం* చేస్తుంటే, ​అధిపతులు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుంటారు,+వివేచన, జ్ఞానం ఉన్న వ్యక్తి సహాయంతో అధిపతి* ఎక్కువకాలం పరిపాలిస్తాడు.+   దీనుల్ని మోసం చేసే పేదవాడు+పంట అంతా నాశనం చేసే వర్షం ​లాంటివాడు.   ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేవాళ్లు దుష్టుల్ని పొగుడుతారు,ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు వాళ్లతో పోరాడతారు.+   చెడ్డవాళ్లు న్యాయాన్ని అర్థంచేసుకోలేరు,యెహోవాను వెతికేవాళ్లు ప్రతీది అర్థం​చేసుకోగలరు.+   అవినీతి మార్గాల్ని అనుసరించే ధన​వంతుడి కన్నాయథార్థంగా నడుచుకునే ​పేదవాడు నయం.+   అవగాహన ఉన్న కుమారుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు,తిండిబోతులతో సహవాసం చేసేవాడు తన తండ్రికి అవమానం తీసుకొస్తాడు.+   వడ్డీతో,+ అక్రమ లాభంతో ఆస్తిని పెంచుకునేవాడుపేదవాళ్ల మీద దయ చూపించేవాడి కోసం దాన్ని పోగుచేస్తున్నాడు.+   ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడనివాళ్ల ప్రార్థన అసహ్యం.+ 10  నిజాయితీపరుణ్ణి మోసం చేసి చెడ్డ ​దారిలోకి లాగేవాడుతాను తవ్విన గోతిలో తానే పడతాడు;+ ఏ నిందా లేనివాళ్లు మంచి ప్రతిఫలం పొందుతారు.+ 11  ధనవంతుడు తన దృష్టిలో తానే తెలివి​గలవాడు,+కానీ వివేచనగల పేదవాడు అతన్ని ​పరిశోధిస్తాడు.*+ 12  నీతిమంతుడు గెలిచినప్పుడు గొప్ప ఘనత కలుగుతుంది,దుష్టులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు.+ 13  తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు,*+వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద కరుణ చూపించబడుతుంది.+ 14  ఎప్పుడూ జాగ్రత్తగా* ఉండేవాడు ​సంతోషంగా ఉంటాడు,తన హృదయాన్ని కఠినం చేసుకునేవాడు ఆపదలో పడతాడు.+ 15  నిస్సహాయుల మీద పరిపాలన చేసే దుష్టుడుగుర్రుమనే సింహం లాంటివాడు, ముందుకు దూకే ఎలుగుబంటి ​లాంటివాడు.+ 16  వివేచనలేని నాయకుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు,అక్రమ లాభాన్ని ద్వేషించేవాడు ఆయుష్షు పెంచుకుంటాడు.+ 17  ప్రాణం తీసి రక్తాపరాధం మూటగట్టు​కునేవాడు సమాధికి* చేరేవరకు ​పారిపోతూనే ఉంటాడు,+ ఎవ్వరూ అతనికి మద్దతు ఇవ్వకూడదు. 18  తప్పు లేకుండా నడుచుకునేవాడు ​రక్షించబడతాడు,+వంకర మార్గాల్ని అనుసరించేవాడు ఉన్నట్టుండి పడిపోతాడు.+ 19  తన పొలాన్ని సాగుచేసే వాడికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది,వ్యర్థమైన వాటిని వెంబడించేవాడు కటిక పేదరికంలో పడతాడు.+ 20  నమ్మకమైనవాడు ఎన్నో దీవెనలు ​పొందుతాడు,+ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు.+ 21  పక్షపాతం చూపించడం మంచిదికాదు;+రొట్టె ముక్క కోసం ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశముంది. 22  ఈర్ష్యపరుడు* సంపదల కోసం ఆరాట​పడతాడు,తనకు పేదరికం రాబోతుందని అతనికి తెలీదు. 23  నాలుకతో పొగిడేవాడి కన్నా ​గద్దించేవాడు+చివరికి ఎక్కువ దయ పొందుతాడు.+ 24  అమ్మానాన్నల్ని దోచుకొని “అదేం తప్పు కాదు” అనేవాడు,+ నాశనం చేసేవాడికి భాగస్వామి. 25  అత్యాశపరుడు* విభేదాలు సృష్టిస్తాడు,యెహోవా మీద ఆధారపడేవాడు ​వర్ధిల్లుతాడు.+ 26  తన హృదయాన్ని నమ్ముకునేవాడు మూర్ఖుడు,కానీ తెలివితో నడుచుకునేవాడు ​తప్పించుకుంటాడు.+ 27  పేదవాళ్లకు ఇచ్చేవాడికి ఏ లోటూ ఉండదు,+వాళ్లను పట్టించుకోకుండా కళ్లు ​మూసుకునే వాడికి చాలా శాపాలు వస్తాయి. 28  దుష్టులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు,వాళ్లు నశించిపోయినప్పుడు నీతిమంతులు ఎక్కువౌతారు.+

అధస్సూచీలు

లేదా “తిరుగుబాటు.”
అక్ష., “అతను.”
లేదా “అతను ఎలాంటివాడో పసిగడతాడు.”
లేదా “విజయం సాధించడు.”
లేదా “దేవునికి భయపడుతూ.”
లేదా “గోతికి.”
లేదా “అత్యాశపరుడు.”
లేదా “అహంకారి” అయ్యుంటుంది.