సామెతలు 19:1-29

  • లోతైన అవగాహన కోపాన్ని చల్లారుస్తుంది (11)

  • కయ్యాలమారి భార్య కురిసే పైకప్పు లాంటిది (13)

  • బుద్ధిగల భార్య యెహోవా ఇచ్చే బహుమతి (14)

  • చెయ్యి దాటిపోకముందే పిల్లవాణ్ణి క్రమశిక్షణలో పెట్టాలి (18)

  • సలహా వినడం తెలివైన పని (20)

19  మూర్ఖుడిగా ఉండి అబద్ధాలాడడం కన్నాపేదవాడిగా ఉండి యథార్థంగా నడుచుకోవడం మంచిది.+   జ్ఞానం లేకుండా ఉండడం మంచిదికాదు,+దురుసుగా ప్రవర్తించేవాడు పాపం చేస్తున్నాడు.   మనిషి తెలివితక్కువతనం అతన్ని తప్పుదారి పట్టిస్తుంది,అతని హృదయం యెహోవా మీద కోపగించుకుంటుంది.   ధనవంతులకు చాలామంది స్నేహితులుంటారు,పేదవాడికి ఉన్న ఒకేఒక్క స్నేహితుడు కూడా అతన్ని విడిచిపెట్టేస్తాడు.   అబద్ధ సాక్షి తప్పకుండా శిక్షించబడతాడు,+నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పేవాడు తప్పించుకోలేడు.   ప్రముఖుడి* అనుగ్రహం పొందడానికి చాలామంది ప్రయత్నిస్తారు,బహుమతులు ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.   పేదవాడి సహోదరులందరూ అతన్ని ద్వేషిస్తారు;+అలాంటిది అతని స్నేహితులు అతన్ని ఇంకెంతగా దూరం పెడతారో కదా!+ అతను వేడుకుంటూ వాళ్ల వెనకాల పడతాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోరు.   వివేకం సంపాదించేవాడు తన ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాడు.+ ఎప్పుడూ వివేచన చూపించేవాడు విజయం సాధిస్తాడు.*+   అబద్ధ సాక్షి తప్పకుండా శిక్షించబడతాడు,నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పేవాడు నాశనమౌతాడు.+ 10  తెలివితక్కువవాడు సుఖభోగాలు అనుభవించడం తగదు;సేవకుడు అధిపతుల మీద పరిపాలించడం కూడా ఏమాత్రం తగదు!+ 11  మనిషి లోతైన అవగాహన అతని కోపాన్ని చల్లారుస్తుంది,+తప్పును* పట్టించుకోకుండా ఉండడం అతనికి ఘనతను తెస్తుంది.+ 12  రాజు కోపం సింహగర్జన లాంటిది,+అతని అనుగ్రహం పచ్చిక మీది మంచు బిందువుల లాంటిది. 13  మూర్ఖుడు తన తండ్రికి కష్టాలు తీసుకొస్తాడు,+గయ్యాళి* భార్య ఆగకుండా కురిసే* పైకప్పు లాంటిది.+ 14  ఇల్లు, ఆస్తి తండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి,బుద్ధిగల భార్య యెహోవా ఇచ్చే బహుమతి.+ 15  సోమరి ఎప్పుడూ పడుకునే ఉంటాడు,బద్దకంగా పనిచేసేవాడు ఆకలితో అలమటిస్తాడు.+ 16  ఆజ్ఞను పాటించేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు;తన మార్గాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు చనిపోతాడు. 17  పేదవాళ్ల మీద దయ చూపించేవాడు యెహోవాకు అప్పు ఇస్తున్నాడు,+అతను చేసినదానికి ఆయన ప్రతిఫలం* ఇస్తాడు.+ 18  చెయ్యి దాటిపోకముందే నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టు,+అతని మరణానికి బాధ్యుడివి అవ్వకు.*+ 19  ముక్కోపి తగిన మూల్యం చెల్లిస్తాడు;నువ్వు అతన్ని తప్పించడానికి ప్రయత్నిస్తే, మళ్లీమళ్లీ అలా చేయాల్సి వస్తుంది.+ 20  నువ్వు ముందుముందు తెలివిగలవాడివి అవ్వాలంటే+సలహాను విను, క్రమశిక్షణను స్వీకరించు. 21  మనిషి హృదయంలో చాలా ప్రణాళికలు ఉంటాయి,అయితే యెహోవా ఆలోచనే* నిలబడుతుంది.+ 22  మనిషి విశ్వసనీయ ప్రేమే అతనికి అందం;+అబద్ధాలకోరుగా ఉండడం కన్నా పేదవాడిగా ఉండడం మేలు. 23  యెహోవా మీదుండే భయం జీవానికి నడిపిస్తుంది;+ఆ భయం ఉన్న వ్యక్తి హాయిగా విశ్రమిస్తాడు, అతనికి ఏ కీడూ రాదు. 24  సోమరి విందుపాత్రలో చెయ్యి ఉంచుతాడుకానీ దాన్ని నోటి దాకా తెచ్చుకోవాలని కూడా అనుకోడు.+ 25  ఎగతాళి చేసేవాణ్ణి కొడితే, అనుభవం లేనివాడు వివేకాన్ని* సంపాదిస్తాడు,+అవగాహన ఉన్నవాణ్ణి గద్దిస్తే, అతను జ్ఞానాన్ని పెంచుకుంటాడు. 26  తండ్రితో దురుసుగా ప్రవర్తించి, తల్లిని వెళ్లగొట్టే కుమారుడుఅవమానాన్ని, తలవంపుల్ని తీసుకొస్తాడు.+ 27  నా కుమారుడా, నువ్వు క్రమశిక్షణను స్వీకరించడం ఆపేస్తేజ్ఞానవంతమైన మాటల నుండి తప్పిపోతావు. 28  పనికిమాలిన సాక్షి న్యాయాన్ని వెక్కిరిస్తాడు,+దుష్టులు కీడు చేయడంలో సంతోషిస్తారు.+ 29  ఎగతాళి చేసేవాళ్ల కోసం తీర్పు,+మూర్ఖుల వీపు కోసం దెబ్బలు వేచివున్నాయి.+

అధస్సూచీలు

లేదా “ఉదారస్వభావం గలవాడి.”
అక్ష., “మేలు పొందుతాడు.”
లేదా “అపరాధాన్ని.”
లేదా “సతాయించే.”
లేదా “కారే.”
లేదా “బహుమతి.”
లేదా “మరణాన్ని కోరుకోకు.”
లేదా “సంకల్పమే; ఉద్దేశమే.”
లేదా “యుక్తిని.”