సామెతలు 10:1-32

  • తెలివిగల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు (1)

  • కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు (4)

  • ఎక్కువ మాటల్లో దోషం ఉంటుంది (19)

  • యెహోవా ఆశీర్వాదం ధనవంతుణ్ణి చేస్తుంది (22)

  • యెహోవాకు భయపడితే ఎక్కువకాలం జీవిస్తారు (27)

10  సొలొమోను సామెతలు. తెలివిగలవాడు తన తండ్రిని ​సంతోషపెడతాడు,+తెలివితక్కువవాడు తన తల్లికి దుఃఖం కలిగిస్తాడు.   అక్రమ సంపాదన ఎందుకూ పనికిరాదు,అయితే నీతి మరణం నుండి రక్షిస్తుంది.   యెహోవా నీతిమంతుల్ని ఆకలితో ​ఉండనివ్వడు,+కానీ దుష్టులు కోరుకునేది వాళ్లకు ​దక్కనివ్వడు.   బద్దకస్తులు పేదవాళ్లౌతారు,+కానీ కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతు​లౌతారు.+   తెలివితో* నడుచుకునే కుమారుడు ​వేసవికాలంలో పంట సమకూరుస్తాడు,కానీ అవమానం తెచ్చే కుమారుడు కోతకాలమప్పుడు గాఢనిద్రలో ఉంటాడు.   నీతిమంతుల తల మీద దీవెనలు ఉంటాయి,+దుష్టుల నోట దౌర్జన్యం దాగివుంటుంది.   నీతిమంతుల్ని గుర్తుచేసుకున్నప్పుడు* దీవిస్తారు,+కానీ దుష్టుల పేరు కనుమరుగౌతుంది.+   తెలివిగలవాడు నిర్దేశాల్ని* స్వీకరిస్తాడు,+తెలివితక్కువగా మాట్లాడేవాడు నాశనమౌతాడు.+   యథార్థంగా నడుచుకునేవాడు ​సురక్షితంగా ఉంటాడు,+వంకర మార్గాల్లో వెళ్లేవాడు పట్టు​బడతాడు.+ 10  కపట బుద్ధితో కన్ను గీటేవాడు దుఃఖం కలిగిస్తాడు,తెలివితక్కువగా మాట్లాడేవాడు నాశనమౌతాడు.+ 11  నీతిమంతుల నోరు జీవపు ఊట,+దుష్టుల నోట దౌర్జన్యం దాగివుంటుంది.+ 12  ద్వేషం గొడవల్ని రేపుతుంది,ప్రేమ తప్పులన్నిటినీ కప్పుతుంది.+ 13  వివేచన గలవాడి పెదాల మీద తెలివి ఉంటుంది,+వివేచన లేనివాడి వీపుకు బెత్తమే ​తగినది.+ 14  తెలివిగలవాళ్లు జ్ఞానాన్ని సంపదలా దాచుకుంటారు,+కానీ తెలివితక్కువవాళ్ల నోరు నాశనాన్ని ఆహ్వానిస్తుంది.+ 15  ధనవంతుడి ఆస్తి అతనికి ప్రాకారాలుగల నగరం. పేదవాడి పేదరికం అతనికి నాశనకరం.+ 16  నీతిమంతుల పని జీవానికి నడిపిస్తుంది;దుష్టుల కష్టార్జితం పాపానికి నడిపిస్తుంది.+ 17  క్రమశిక్షణను స్వీకరించేవాడు జీవమార్గం అవుతాడు,*గద్దింపును నిర్లక్ష్యం చేసేవాడు తప్పుదారి పట్టిస్తాడు. 18  ద్వేషాన్ని దాచుకునేవాడు ​అబద్ధాలాడతాడు,+తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసేవాడు మూర్ఖుడు. 19  ఎక్కువ మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది,+తన పెదాల్ని అదుపు చేసుకునేవాడు బుద్ధి గలవాడు.+ 20  నీతిమంతుని నాలుక శ్రేష్ఠమైన వెండి లాంటిది,+కానీ దుష్టుని హృదయానికున్న విలువ చాలా తక్కువ. 21  నీతిమంతుని పెదాలు చాలామందిని ​నడిపిస్తాయి,*+అయితే మూర్ఖుడు వివేచన లేకపోవడం వల్ల చనిపోతాడు.+ 22  యెహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ​ధనవంతుణ్ణి చేస్తుంది,+ఆయన దానికి ఎలాంటి కష్టం* చేర్చడు. 23  అవమానకరంగా ప్రవర్తించడం మూర్ఖునికి ఆటలా ఉంటుంది,అయితే వివేచన గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.+ 24  దుష్టుడు భయపడేదే అతని మీదికి వస్తుంది;అయితే నీతిమంతుని కోరిక నెరవేరుతుంది.+ 25  సుడిగాలి వీచినప్పుడు దుష్టుడు లేకుండా పోతాడు,+కానీ నీతిమంతుడు ఎప్పటికీ నిలిచివుండే పునాది లాంటివాడు.+ 26  పళ్లకు పుల్లటి ద్రాక్షారసం, కళ్లకు పొగ ఎలా ఉంటాయోబద్దకస్తుడు తన యజమానికి* అలా ఉంటాడు. 27  యెహోవాకు భయపడితే ఎక్కువకాలం జీవిస్తారు,+అయితే దుష్టుల ఆయుష్షు తగ్గించబ​డుతుంది.+ 28  నీతిమంతుల ఆశ సంతోషాన్ని ​తీసుకొస్తుంది,+దుష్టుల ఆశ భంగమైపోతుంది.+ 29  నిందలేని వాళ్లకు యెహోవా మార్గం ​బలమైన కోట,+అయితే తప్పుచేసే వాళ్లకు అది ​నాశనకరం.+ 30  నీతిమంతులు ఎన్నడూ పడిపోరు,+కానీ దుష్టులు ఇక భూమ్మీద ఉండరు.+ 31  నీతిమంతుల నోటి నుండి తెలివిగల మాటలు* వస్తాయి,కానీ వంకరబుద్ధి గలవాళ్ల నాలుక కోసేయబడుతుంది. 32  నీతిమంతుల పెదాలకు ఆహ్లాదకరమైన మాటలు తెలుసు,అయితే దుష్టుల నోరు తప్పుడు మాటలు మాట్లాడుతుంది.

అధస్సూచీలు

లేదా “లోతైన అవగాహనతో.”
లేదా “వాళ్ల మంచిపేరును బట్టి.”
అక్ష., “ఆజ్ఞల్ని.”
లేదా “జీవమార్గంలో ఉన్నాడు” అయ్యుంటుంది.
లేదా “పోషిస్తాయి.”
లేదా “వేదన; బాధ.”
లేదా “తనను పంపినవానికి.”
లేదా “ఫలాలు.”