సామెతలు 1:1-33
1 దావీదు కుమారుడూ,+ ఇశ్రాయేలు రాజూ+ అయిన సొలొమోను సామెతలు:+
2 తెలివిని, ఉపదేశాన్ని* నేర్చుకోవడానికి;*తెలివిగల మాటల్ని అర్థం చేసుకోవడానికి;
3 లోతైన అవగాహనను, నీతిని, మంచి వివేచనను,*+ నిజాయితీని*ఇచ్చే ఉపదేశాన్ని*+ సంపాదించుకోవడానికి;
4 అనుభవంలేని వాళ్లకు వివేకాన్ని,*+యౌవనులకు జ్ఞానాన్ని, ఆలోచనా సామర్థ్యాన్ని+ ఇవ్వడానికి రాసిన సామెతలు.
5 తెలివిగలవాళ్లు విని, మరింత ఉపదేశం పొందుతారు;+అవగాహన ఉన్నవాళ్లు తెలివిగల* నిర్దేశాన్ని తీసుకుంటారు,+
6 దానివల్ల వాళ్లు సామెతల్ని, చిక్కు ప్రశ్నల్ని*జ్ఞానుల మాటల్ని, పొడుపుకథల్ని+ అర్థంచేసుకోగలుగుతారు.
7 యెహోవా పట్ల భయమే* జ్ఞానానికి ఆరంభం.+
మూర్ఖులే తెలివిని, క్రమశిక్షణను నీచంగా చూస్తారు.+
8 నా కుమారుడా, మీ నాన్న క్రమశిక్షణను స్వీకరించు,+మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెట్టకు.+
9 అవి నీ తలకు అందమైన పూలదండలా,+నీ మెడకు సొగసైన హారంలా ఉంటాయి.+
10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోకు.+
11 వాళ్లు ఇలా అంటారు: “మాతో రా.
రక్తం చిందించడానికి పొంచి ఉందాం.
దాక్కొని ఉండి, అమాయకుల మీద దాడిచేద్దాం.
12 సమాధి* మింగేసినట్టు వాళ్లను ప్రాణాలతోనే మింగేద్దాం,గోతిలోకి దిగిపోయేవాళ్లలా వాళ్లను నిలువునా మింగేద్దాం.
13 వాళ్ల విలువైన సంపదలన్నిటినీ లాక్కుందాం;దోపుడుసొమ్ముతో మన ఇళ్లను నింపుకుందాం.
14 నువ్వు మాతో చేతులు కలుపు,దోచుకున్న వాటిని అందరం సమానంగా పంచుకుందాం.”
15 నా కుమారుడా, నువ్వు వాళ్ల వెంట వెళ్లకు.
వాళ్ల దారికి దూరంగా ఉండు,+
16 వాళ్ల పాదాలు కీడు చేయడానికి పరుగెత్తుతాయి;వాళ్లు రక్తం చిందించడానికి త్వరపడతారు.+
17 పక్షి చూస్తుండగా వలను పరచడం వృథా.
18 అందుకే వాళ్లు రక్తం చిందించడానికి పొంచి ఉంటారు;ప్రాణాలు తీయడానికి దాక్కునివుంటారు.
19 అక్రమ లాభం సంపాదించేవాళ్ల పద్ధతులు ఇలా ఉంటాయి,అది దాన్ని పొందేవాళ్ల ప్రాణాలు తీస్తుంది.+
20 నిజమైన తెలివి+ వీధుల్లో కేకలు వేస్తోంది.+
సంతవీధుల్లో బిగ్గరగా మాట్లాడుతోంది.+
21 అది రద్దీగా ఉన్న వీధుల మూలల్లో ప్రకటిస్తోంది.
నగర ప్రవేశ ద్వారాల్లో ఇలా అంటోంది:+
22 “అనుభవంలేని వాళ్లారా, మీరు ఎంతకాలం అజ్ఞానాన్ని ప్రేమిస్తారు?
ఎగతాళి చేసేవాళ్లారా, మీరు ఎంతకాలం ఎగతాళి చేస్తూ సంతోషిస్తారు?
మూర్ఖులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?+
23 నా గద్దింపును విని, మారండి.+
అప్పుడు నేను మీకు తెలివిని* ఇస్తాను;
నా మాటల్ని మీకు తెలియజేస్తాను.+
24 అయితే నేను పిలిచినప్పుడు మీరు వినలేదు,నేను చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు,+
25 మీరు నా సలహాలన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ,నా గద్దింపుల్ని తిరస్కరిస్తూ వచ్చారు;
26 అందుకే, మీ మీదికి విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నవ్వుతాను;మీరు భయపడేది మీ మీదికి వచ్చినప్పుడు ఎగతాళి చేస్తాను.+
27 మీరు భయపడేది తుఫానులా విరుచుకుపడినప్పుడు,విపత్తు సుడిగాలిలా మీ మీదికి వచ్చినప్పుడు,మీకు దుఃఖం, కష్టం కలిగినప్పుడు నేను నవ్వుతాను.
28 ఆ సమయంలో వాళ్లు నాకు మొరపెడుతూ ఉంటారు, కానీ నేను జవాబివ్వను;నా కోసం ఆత్రుతతో వెదుకుతారు, కానీ నేను దొరకను,+
29 ఎందుకంటే వాళ్లు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు,+యెహోవాకు భయపడాలని వాళ్లు అనుకోలేదు.+
30 వాళ్లు నా సలహాను వద్దనుకున్నారు;నేను ఎన్నిసార్లు గద్దించినా అస్సలు లెక్కచేయలేదు.
31 కాబట్టి వాళ్లు తమ పనుల పర్యవసానాల్ని అనుభవిస్తారు,+వాళ్ల ఆలోచనల* వల్ల వాళ్లకే వెగటు పుడుతుంది.
32 ఎందుకంటే, అనుభవం లేనివాళ్ల తిరుగుబాటు స్వభావం వాళ్లను చంపుతుంది,మూర్ఖుల నిశ్చింత వైఖరి వాళ్లను నాశనం చేస్తుంది.
33 కానీ నా మాటలు వినేవాళ్లు, విపత్తు వస్తుందనే భయం లేకుండా+సురక్షితంగా నివసిస్తారు.”+
అధస్సూచీలు
^ లేదా “క్రమశిక్షణను.”
^ అక్ష., “తెలుసుకోవడానికి.”
^ లేదా “సరైనదాన్ని.”
^ లేదా “నిష్పక్షపాతాన్ని.”
^ లేదా “క్రమశిక్షణను.”
^ లేదా “యుక్తిని.”
^ లేదా “నేర్పుగల.”
^ లేదా “ఉపమానాల్ని.”
^ లేదా “భయభక్తులే.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి. ఇది దేవుని పవిత్రశక్తి ఇచ్చే తెలివిని సూచిస్తుండవచ్చు.
^ లేదా “పథకాల, పన్నాగాల.”