సంఖ్యాకాండం 33:1-56

  • ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలోని దశలు (1-49)

  • కనానును జయించడం గురించి నిర్దేశాలు (50-56)

33  మోషే, అహరోనుల నిర్దేశం కింద ఇశ్రాయేలు ప్రజలు వాళ్లవాళ్ల గుంపుల* ప్రకారం+ ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు, వాళ్లు దశలవారీగా తమ ప్రయాణం కొనసాగించారు.  ఇశ్రాయేలీయులు తమ ప్రయాణంలోని ఆయా దశల్లో ఎక్కడెక్కడి నుండి బయల్దేరారనే వివరాల్ని యెహోవా ఆదేశం ప్రకారం మోషే నమోదు చేస్తూ వచ్చాడు. ఆ వివరాలు ఇవి:  మొదటి నెల 15వ రోజున వాళ్లు రామెసేసు+ నుండి బయల్దేరారు. సరిగ్గా పస్కా పండుగ+ తర్వాతి రోజే ఐగుప్తీయులందరి కళ్లముందు ఇశ్రాయేలీయులు ధైర్యంగా బయటికి వచ్చారు.  ఆ సమయంలో ఐగుప్తీయులు యెహోవా చేత చంపబడిన తమ మొదటి సంతానం అంతటినీ పాతిపెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యెహోవా వాళ్ల దేవుళ్ల మీద తీర్పులు అమలుచేశాడు.+  ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి బయల్దేరి సుక్కోతులో దిగారు.+  తర్వాత సుక్కోతు నుండి బయల్దేరి ఎడారి అంచున ఉన్న ఏతాములో దిగారు.+  ఏతాము నుండి వెనక్కి తిరిగి బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతు+ వైపుగా ప్రయాణించి మిగ్దోలులో దిగారు.+  పీహహీరోతు నుండి బయల్దేరి సముద్రం మధ్యలో నడుస్తూ ఎడారికి+ చేరుకున్నారు; తర్వాత ఏతాము ఎడారిలో+ మూడు రోజుల ప్రయాణమంత దూరం నడుచుకుంటూ వెళ్లి మారాలో+ దిగారు.  వాళ్లు మారా నుండి బయల్దేరి ఏలీముకు చేరుకున్నారు. ఏలీములో 12 నీటి ఊటలు, 70 ఖర్జూర చెట్లు ఉండడంతో అక్కడ దిగారు.+ 10  తర్వాత ఏలీము నుండి బయల్దేరి ఎర్ర​సముద్రం దగ్గర దిగారు. 11  ఎర్రసముద్రం నుండి బయల్దేరి సీను ఎడారిలో దిగారు.+ 12  సీను ఎడారి నుండి బయల్దేరి దోపకాలో దిగారు. 13  దోపకా నుండి బయల్దేరి ఆలూషులో దిగారు. 14  ఆలూషు నుండి బయల్దేరి రెఫీదీములో దిగారు,+ కానీ ప్రజలు తాగడానికి అక్కడ నీళ్లు లేవు. 15  తర్వాత వాళ్లు రెఫీదీము నుండి బయల్దేరి సీనాయి ఎడారిలో+ దిగారు. 16  ఆ తర్వాత సీనాయి ఎడారి నుండి బయల్దేరి వాళ్లు కిబ్రోతు-హత్తావాలో+ దిగారు. 17  కిబ్రోతు-హత్తావా నుండి బయల్దేరి హజేరోతులో దిగారు.+ 18  హజేరోతు నుండి బయ​ల్దేరి రిత్మాలో దిగారు. 19  రిత్మా నుండి బయ​ల్దేరి రిమ్మోను-పారెసులో దిగారు. 20  రిమ్మోను-పారెసు నుండి బయల్దేరి లిబ్నాలో దిగారు. 21  లిబ్నా నుండి బయల్దేరి రీసాలో దిగారు. 22  రీసా నుండి బయల్దేరి కెహేలాతాలో దిగారు. 23  కెహేలాతా నుండి బయల్దేరి షాపెరు కొండ దగ్గర దిగారు. 24  ఆ తర్వాత షాపెరు కొండ దగ్గర నుండి బయల్దేరి హరాదాలో దిగారు. 25  హరాదా నుండి బయల్దేరి మకెలోతులో దిగారు. 26  మకెలోతు నుండి బయల్దేరి+ తాహతులో దిగారు. 27  తాహతు నుండి బయల్దేరి తారహులో దిగారు. 28  తారహు నుండి బయల్దేరి మిత్కాలో దిగారు. 29  మిత్కా నుండి బయల్దేరి హష్మోనాలో దిగారు. 30  హష్మోనా నుండి బయల్దేరి మొసేరోతులో దిగారు. 31  మొసేరోతు నుండి బయల్దేరి బెనేయాకానులో దిగారు.+ 32  ​బెనేయాకాను నుండి బయల్దేరి హోర్‌హ​గ్గిద్గాదులో దిగారు. 33  హోర్‌హగ్గిద్గాదు నుండి బయల్దేరి యొత్బాతాలో దిగారు.+ 34  యొత్బాతా నుండి బయల్దేరి ఎబ్రోనాలో దిగారు. 35  ఎబ్రోనా నుండి బయల్దేరి ఎసోన్గెబెరులో+ దిగారు. 36  ఎసోన్గెబెరు నుండి బయల్దేరి సీను ఎడారిలో,+ అంటే కాదేషులో దిగారు. 37  ఆ తర్వాత వాళ్లు కాదేషు నుండి బయల్దేరి ఎదోము సరిహద్దున ఉన్న హోరు కొండ దగ్గర దిగారు.+ 38  అక్కడ, యెహోవా ఆదేశం మేరకు అహరోను హోరు కొండ మీదికి వెళ్లి అక్కడే చనిపోయాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచివచ్చిన 40వ సంవత్సరం, ఐదో నెల, మొదటి రోజున ఇది జరిగింది.+ 39  హోరు కొండ మీద చనిపోయినప్పుడు ​అహరోను వయసు 123 ఏళ్లు. 40  ఆ సమయంలో, కనానీయుడైన అరాదు రాజు+ ఇశ్రాయేలీయులు వస్తున్నారనే సంగతి విన్నాడు. అతను కనానులోని నెగెబులో నివసించేవాడు. 41  కొంతకాలానికి వాళ్లు హోరు కొండ దగ్గర నుండి బయల్దేరి+ ​సల్మానాలో దిగారు. 42  సల్మానా నుండి బయల్దేరి పూనొనులో దిగారు. 43  పూనొను నుండి బయల్దేరి ఓబోతులో దిగారు.+ 44  ఓబోతు నుండి బయల్దేరి మోయాబు సరిహద్దున ఉన్న ఈయ్యె-అబారీములో దిగారు.+ 45  ఈయ్యెం* నుండి బయ​ల్దేరి దీబోనుగాదులో+ దిగారు. 46  దీబోనుగాదు నుండి బయల్దేరి అల్మోను-దిబ్లాతాయిములో దిగారు. 47  అల్మోను-దిబ్లాతాయిము నుండి బయల్దేరి నెబో+ ఎదురుగా ఉన్న అబారీము కొండల్లో+ దిగారు. 48  చివరిగా వాళ్లు అబారీము కొండల దగ్గర నుండి బయల్దేరి యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో దిగారు.+ 49  యొర్దాను పక్కన, మోయాబు ఎడారి మైదానాల్లో బేత్యేషిమోతు నుండి ఆబేల్‌-షిత్తీము+ వరకు ఉన్న ప్రాంతంలో వాళ్లు కొంతకాలం ఉన్నారు. 50  వాళ్లు యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో ఉన్నప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 51  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలోకి వెళ్లబోతున్నారు.+ 52  మీరు ఆ దేశ నివాసులందర్నీ మీ ముందు నుండి వెళ్లగొట్టాలి; వాళ్ల రాతి విగ్రహాలన్నిటినీ,+ పోత* విగ్రహాలన్నిటినీ+ ధ్వంసం చేయాలి; వాళ్ల పవిత్రమైన ఉన్నత స్థలాలన్నిటినీ కూల్చేయాలి.+ 53  మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అందులో నివసిస్తారు, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఆ దేశాన్ని మీకు సొత్తుగా ఇస్తాను.+ 54  మీ కుటుంబాలకు సొత్తుగా ఇచ్చిన దేశాన్ని మీరు చీట్లు+ వేసి పంచుకోవాలి. పెద్ద గుంపులకు ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి, చిన్న గుంపులకు తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి.+ ఒక వ్యక్తి చీటి ఎక్కడ పడుతుందో అతని స్వాస్థ్యం అక్కడ ఉంటుంది. మీ పూర్వీకుల గోత్రాల ప్రకారం మీరు మీ ఆస్తిని స్వాస్థ్యంగా పొందుతారు.+ 55  “ ‘అయితే మీరు ఆ దేశ నివాసుల్ని మీ ముందు నుండి వెళ్లగొట్టకపోతే,+ అలా మీరు ​ఉండనిచ్చిన వాళ్లు మీ కంట్లో నలుసులా, మీ పక్కలో బల్లెంలా తయారౌతారు, మీరు నివసించబోతున్న దేశంలో వాళ్లు మిమ్మల్ని వేధిస్తారు.+ 56  అంతేకాదు, నేను వాళ్ల మీదికి తేవాలనుకున్న శిక్షను మీ మీదికి తెస్తాను.’ ”+

అధస్సూచీలు

అక్ష., “సైన్యాల.”
ఇది ఈయ్యె-అబారీముకు సంక్షిప్త రూపం అయ్యుంటుంది.
లేదా “లోహపు.”