సంఖ్యాకాండం 28:1-31

 • ఆయా అర్పణలు అర్పించాల్సిన పద్ధతి (1-31)

  • ప్రతీరోజు అర్పణలు (1-8)

  • విశ్రాంతి రోజు అర్పణలు (9, 10)

  • నెలవారీ అర్పణలు (11-15)

  • పస్కా కోసం (16-25)

  • వారాల పండుగ కోసం (26-31)

28  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించు: ‘మీరు నా అర్పణను, అంటే నా ఆహారాన్ని తీసుకొచ్చేలా జాగ్రత్తపడాలి. వాటివాటి నియమిత సమయాల్లో అగ్నితో అర్పించే అర్పణల్ని నాకు అర్పించాలి,+ అది నాకు ఇంపైన* సువాసన.’  “నువ్వు వాళ్లకు ఇలా చెప్పు: ‘మీరు అగ్నితో అర్పించే అర్పణగా వీటిని యెహోవా దగ్గరికి తీసుకురావాలి: ప్రతీరోజు దహనబ​లిగా అర్పించడం కోసం ఏ లోపంలేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లలు.+  పొద్దున ఒక మగ గొర్రెపిల్లను, సంధ్య వెలుగు సమయంలో* ఇంకో మగ గొర్రెపిల్లను అర్పించాలి.+  వాటితోపాటు ధాన్యార్పణగా ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని హిన్‌లో* నాలుగో వంతు దంచితీసిన నూనె కలిపి తీసుకురావాలి.+  సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞాపించినట్టు, ఈ దహనబలిని మీరు ఎప్పుడూ అర్పించాలి.+ ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన.  దానితోపాటు ఒక్కో మగ గొర్రెపిల్ల కోసం పానీయార్పణగా హిన్‌లో నాలుగో వంతు మత్తుపానీయాన్ని తీసుకురావాలి.+ యెహోవాకు పానీయార్పణగా దాన్ని పవిత్ర స్థలంలో పోయాలి.  ఇంకో మగ గొర్రెపిల్లను సంధ్య వెలుగు సమయంలో* అర్పించాలి. పొద్దున అర్పించిన లాంటి ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు దాన్ని అర్పించాలి. యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా దాన్ని అర్పించాలి, అది ఆయనకు ఇంపైన* సువాసన.+  “ ‘అయితే విశ్రాంతి రోజున+ మాత్రం, ఏ లోపంలేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లల్ని అర్పించాలి. వాటితోపాటు, ధాన్యార్పణగా ఈఫాలో రెండు పదోవంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి; అలాగే పానీయార్పణను కూడా తీసుకురావాలి. 10  ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని పానీయార్పణతో పాటు విశ్రాంతి రోజున ఈ దహనబలిని కూడా అర్పించాలి.+ 11  “ ‘ప్రతీనెల ఆరంభంలో వీటిని యెహో​వాకు దహనబలిగా అర్పించాలి: రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఏ లోపంలేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు.+ 12  అంతేకాదు, ధాన్యార్పణగా+ ఒక్కో కోడెదూడకు ఈఫాలో మూడు ​పదోవంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి; పొట్టేలుకైతే+ ఈఫాలో రెండు పదో​వంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి; 13  అలాగే ఒక్కో మగ గొర్రెపిల్లకు ఈఫాలో పదోవంతు మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి. వీటిని దహనబలిగా అర్పించాలి. ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన.+ 14  అలాగే, పానీయార్పణగా కోడెదూడకైతే హిన్‌లో సగం ద్రాక్షా​రసాన్ని,+ పొట్టేలుకైతే హిన్‌లో మూడో వంతు ద్రాక్షారసాన్ని,+ అదే మగ గొర్రెపిల్లకైతే హిన్‌లో నాలుగో వంతు ద్రాక్షారసాన్ని+ తీసుకురావాలి. ఏడాది పొడవునా ప్రతీనెల మీరు ఈ దహనబలిని అర్పించాలి. 15  అంతేకాదు, ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని పానీయార్పణతో పాటు పాపపరి​హారార్థ బలిగా ఒక మేకపిల్లను యెహోవాకు అర్పించాలి. 16  “ ‘మొదటి నెల 14వ రోజున యెహోవాకు పస్కా పండుగ ఉంటుంది.+ 17  అలాగే ఆ నెల 15వ రోజున ఒక పండుగ ఉంటుంది. మీరు ఏడురోజుల పాటు పులవని రొట్టెలు తింటారు.+ 18  మొదటి రోజు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు. 19  యెహోవాకు అగ్నితో అర్పించే దహనబలిగా మీరు రెండు కోడెదూడల్ని, ఒక పొట్టేలును, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లల్ని తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 20  వాటి ధాన్యార్పణలతో పాటు వాటిని అర్పించాలి; కోడెదూడకైతే ఈఫాలో మూడు పదోవంతుల మెత్తని పిండిని, పొట్టేలుకైతే రెండు పదోవంతుల మెత్తని పిండిని నూనె కలిపి తీసుకురావాలి.+ 21  ఏడు మగ గొర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతు చొప్పున అర్పించాలి. 22  అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారార్థ బలిగా ఒక మేకను అర్పించాలి. 23  ప్రతీ ఉదయం అర్పించే దహనబలితో పాటు వీటిని దహనబలిగా అర్పించాలి. 24  మీరు ఏడురోజుల పాటు ప్రతీరోజు ఇలాగే వాటిని ​ఆహారంగా అర్పించాలి; ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని పానీయార్పణతో పాటు దీన్ని అర్పించాలి. 25  ఏడో రోజున మీరు పవిత్ర సమావేశం జరుపుకోవాలి.+ ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు.+ 26  “ ‘మీరు మొదటి పంట+ నుండి యెహోవాకు కొత్త ధాన్యాన్ని అర్పించే రోజున,+ మీ వారాల పండుగప్పుడు+ ఒక పవిత్ర సమావేశం జరుపుకోవాలి. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు.+ 27  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా దహనబలి అర్పించడానికి మీరు వీటిని తీసుకురావాలి: రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు.+ 28  అంతేకాదు, వాటి ధాన్యార్పణగా నూనె కలిపిన మెత్తని పిండిని తీసుకురావాలి. ఒక్కో కోడెదూడకు ఈఫాలో మూడు పదోవంతుల మెత్తని పిండిని, పొట్టేలుకైతే ఈఫాలో రెండు పదోవంతుల మెత్తని పిండిని, 29  ఏడు మగ గొర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతు పిండిని తీసుకురావాలి. 30  అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక మేకపిల్లను తీసుకురావాలి.+ 31  ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణతో పాటు వీటిని అర్పించాలి. ఆ జంతువుల్లో ఏ లోపం ఉండకూడదు,+ వాటితో పాటు వాటి పానీయార్పణల్ని కూడా అర్పించాలి.

అధస్సూచీలు

లేదా “శాంతపర్చే.”
అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక హిన్‌ 3.67 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “శాంతపర్చే.”
అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”