సంఖ్యాకాండం 24:1-25

  • బిలాము కావ్యరూపంలో అన్న మూడో మాట (1-11)

  • బిలాము కావ్యరూపంలో అన్న నాలుగో మాట (12-25)

24  ఇశ్రాయేలును దీవించడం యెహో​వాకు నచ్చిందని* బిలాము గ్రహించినప్పుడు అతను మళ్లీ శకునాలు చూడడానికి ​వెళ్లలేదు,+ బదులుగా అతను ఎడారి వైపు తన ముఖం తిప్పుకున్నాడు.  బిలాము తల ఎత్తి, ఇశ్రాయేలీయులు తమతమ గోత్రాల ప్రకారం డేరాలు వేసుకొని నివసించడం+ చూసినప్పుడు, దేవుని పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది.+  అప్పుడతను కావ్యరూపంలో ఇలా అన్నాడు:+ “బెయోరు కుమారుడైన బిలాము ఇలా అంటున్నాడు,తన కళ్లు తెరవబడిన వ్యక్తి ఇలా అంటున్నాడు,   దేవుని మాటలు వింటున్న వ్యక్తి,సర్వశక్తిమంతుడి దర్శనం చూసిన వ్యక్తి, కళ్లు తెరవబడి సాష్టాంగపడిన వ్యక్తి ఇలా అంటున్నాడు:+   యాకోబూ, నీ డేరాలు ఎంత అందంగా ఉన్నాయి!ఇశ్రాయేలూ, నీ నివాసాలు ఎంత చక్కగా ఉన్నాయి!+   లోయల్లా* అవి చాలాదూరం ​విస్తరించాయి,+నది పక్కన తోటల్లా,యెహోవా నాటిన అగరు మొక్కల్లా,నీళ్ల పక్కన ఉన్న దేవదారు చెట్లలా అవి చాలాదూరం విస్తరించాయి.   అతని రెండు పాత్రల్లో నుండి నీళ్ల చుక్కలు పడుతూ ఉంటాయి,అతని విత్తనం* విస్తారమైన జలాల పక్కన విత్తబడుతుంది.+ అతని రాజు+ కూడా అగగు కన్నా ​గొప్పవాడిగా ఉంటాడు,+అతని రాజ్యం హెచ్చించబడుతుంది.+   దేవుడే వాళ్లను ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నాడు;ఆయన వాళ్లకు అడవి ఎద్దు కొమ్ముల లాంటివాడు. దేశాల్ని, తన శత్రువుల్ని అతను ​దహించేస్తాడు,+వాళ్ల ఎముకల్ని కొరుకుతాడు, తన ​బాణాలతో వాళ్లను చెదరగొడతాడు.   అతను పొంచివున్నాడు, సింహంలా ​పడుకొని ఉన్నాడు,అతను సింహం లాంటివాడు, అతన్ని లేపే సాహసం ఎవరు చేయగలరు? నిన్ను దీవించేవాళ్లు దీవించబడతారు,నిన్ను శపించేవాళ్లు శపించబడతారు.”+ 10  అప్పుడు బాలాకుకు బిలాము మీద పిచ్చికోపం వచ్చింది. బాలాకు కోపంతో తన చేతులు చరుచుకొని బిలాముతో ఇలా అన్నాడు: “నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను పిలిపించాను,+ నువ్వేమో ఈ మూడుసార్లు వాళ్లను ​దీవించావు. 11  నువ్వు వెంటనే ఇంటికి వెళ్లిపో. నేను నిన్ను గొప్పగా సన్మానించాలని ​అనుకున్నాను,+ కానీ ఇదిగో! యెహోవా అది నీకు ​దక్కకుండా చేశాడు.” 12  బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: “నువ్వు పంపిన సందేశకులతో నేను ఇలా చెప్పలేదా? 13  ‘బాలాకు తన ఇంటిని వెండిబంగారాలతో నింపి ఇచ్చినా, యెహోవా ఆదేశాన్ని మీరి నా అంతట నేను ఏమీ చేయలేను; అది మంచే గానీ, చెడే గానీ. యెహోవా నాకు ఏం చెప్తే నేను అదే చెప్తాను.’+ 14  ఇప్పుడు నేను నా ప్రజల దగ్గరికి వెళ్లిపోతున్నాను. అయితే రానున్న రోజుల్లో* ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో నీకు చెప్తాను.” 15  అప్పుడతను కావ్య​రూపంలో ఇలా అన్నాడు:+ “బెయోరు కుమారుడైన బిలాము ఇలా అంటున్నాడు,తన కళ్లు తెరవబడిన వ్యక్తి ఇలా అంటున్నాడు,+ 16  దేవుని మాటలు వింటున్న వ్యక్తి,సర్వోన్నతుడి గురించిన జ్ఞానం ఉన్న వ్యక్తి,తన కళ్లు తెరవబడి సాష్టాంగపడుతున్నప్పుడుసర్వశక్తిమంతుడి దర్శనం చూసిన వ్యక్తి ఇలా అంటున్నాడు: 17  నేను అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు;నేను అతన్ని చూస్తాను, కానీ వెంటనే కాదు. యాకోబులో నుండి ఒక నక్షత్రం+ ​బయల్దేరుతుంది,ఇశ్రాయేలులో నుండి రాజదండం+ పైకి లేస్తుంది.+ అతను మోయాబు నుదురును* పగలగొడతాడు,+అల్లరిమూక పుర్రెల్ని చితగ్గొడతాడు. 18  ఇశ్రాయేలు తన పరాక్రమాన్ని ​చూపిస్తున్నప్పుడుఎదోము స్వాధీనం చేసుకోబడుతుంది,+అవును, శేయీరు+ తన శత్రువుల స్వాధీనమౌతుంది.+ 19  యాకోబు నుండి వచ్చిన ఒక వ్యక్తి జయిస్తూ వెళ్తాడు,+ఆ నగర నాశనాన్ని తప్పించుకునే ప్రతీ ఒక్కర్ని అతను చంపేస్తాడు.” 20  అమాలేకును చూసినప్పుడు అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు: “అమాలేకు మొదటి జనం,+అయితే చివరికి అతను నాశనమౌతాడు.”+ 21  కేనీయుల్ని+ చూసినప్పుడు అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు: “నీ నివాస స్థలం సురక్షితంగా ఉంది, అది కొండ పైనున్న గూడులా ఉంది. 22  అయితే కేయీను* కాల్చివేయబడతాడు. అష్షూరు నిన్ను ఖైదీగా తీసుకెళ్లడానికి ఇంకెంతకాలం?” 23  అతను కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు: “అయ్యో! దేవుడు అలా చేసినప్పుడు ఎవరు తప్పించుకుంటారు? 24  కిత్తీము+ తీరం నుండి ఓడలు వస్తాయి,అవి అష్షూరును+ బాధిస్తాయి,ఏబెరును బాధిస్తాయి. అయితే అతను కూడా పూర్తిగా నాశన​మౌతాడు.” 25  తర్వాత బిలాము+ లేచి తన చోటికి తిరిగెళ్లిపోయాడు. బాలాకు కూడా తన దారిన వెళ్లిపోయాడు.

అధస్సూచీలు

అక్ష., “దృష్టికి మంచిదిగా ఉందని.”
లేదా “వాగుల్లా.”
లేదా “సంతానం.”
లేదా “రోజుల చివర్లో.”
లేదా “కణతల్ని.”
లేదా “కేనీయులు.”