సంఖ్యాకాండం 2:1-34

 • మూడు-గోత్రాల విభాగాల ఏర్పాటు (1-34)

  • యూదా విభాగం తూర్పు వైపు (3-9)

  • రూబేను విభాగం దక్షిణం వైపు (10-16)

  • లేవీయుల డేరాలు మధ్యలో (17)

  • ఎఫ్రాయిము విభాగం పడమటి వైపు (18-24)

  • దాను విభాగం ఉత్తరం వైపు (25-31)

  • పేర్లు నమోదైన పురుషుల మొత్తం సంఖ్య (32-34)

2  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు:  “ఇశ్రాయేలీయులు, తమ మూడు-గోత్రాల విభాగం ఎక్కడ నియమించబడిందో అక్కడ తమ డేరాలు వేసుకోవాలి, ప్రతీ ఒక్కరు తమ పూర్వీకుల కుటుంబ ధ్వజం* దగ్గర డేరా వేసుకోవాలి. వాళ్లు ప్రత్యక్ష గుడారానికి ​ఎదురుగా,* దాని చుట్టూ డేరాలు వేసుకోవాలి.  “తూర్పు వైపున, అంటే సూర్యుడు ఉదయించే వైపున యూదా మూడు-గోత్రాల విభాగం తమ గుంపుల్ని* బట్టి డేరాలు వేసుకోవాలి; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను+ యూదా వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు.  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 74,600.+  అతని పక్కన ఇశ్శాఖారు గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; సూయారు కుమారుడైన నెతనేలు+ ఇశ్శాఖారు వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు.  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 54,400.+  వాళ్ల పక్కన జెబూలూను గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; హేలోను కుమారుడైన ఏలీయాబు+ జెబూ​లూను వంశస్థులకు ​ప్రధానుడిగా ఉంటాడు.  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 57,400.+  “యూదా మూడు-గోత్రాల విభాగంలోని సైన్యాల్లో నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 1,86,400. వీళ్లు అందరికన్నా ముందు బయల్దేరాలి.+ 10  “దక్షిణం వైపున రూబేను+ మూడు-గో​త్రాల విభాగం తమ గుంపుల్ని* బట్టి డేరాలు వేసుకోవాలి. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు+ రూబేను వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 11  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 46,500.+ 12  అతని పక్కన షిమ్యోను గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు+ షిమ్యోను వంశ​స్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 13  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 59,300.+ 14  వాళ్ల పక్కన గాదు గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు+ గాదు వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 15  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 45,650.+ 16  “రూబేను మూడు-గోత్రాల విభాగంలోని సైన్యాల్లో నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 1,51,450. వీళ్లు యూదా మూడు-గోత్రాల విభాగం తర్వాత బయల్దేరాలి.+ 17  “ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకెళ్తున్నప్పుడు,+ లేవీయులు మిగతా గుంపులకు మధ్యలో ఉండాలి. “వాళ్లు ఏ క్రమంలో డేరాలు వేసుకుంటారో అదే క్రమంలో ప్రయాణించాలి,+ ప్రతీ ఒక్కరు తమ మూడు-గోత్రాల విభాగం ప్రకారం తమతమ స్థానాల్లో ఉండాలి. 18  “పడమటి వైపున ఎఫ్రాయిము మూడు-గోత్రాల విభాగం తమ గుంపుల్ని* బట్టి డేరాలు వేసుకోవాలి; అమీహూదు కుమారుడైన ఎలీషామా+ ఎఫ్రాయిము వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 19  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 40,500.+ 20  అతని పక్కన మనష్షే+ గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; పెదాసూరు కుమారుడైన గమలీయేలు+ మనష్షే వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 21  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 32,200.+ 22  వాళ్ల పక్కన బెన్యామీను గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; గిద్యోనీ కుమారుడైన అబీదాను+ బెన్యామీను వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 23  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 35,400.+ 24  “ఎఫ్రాయిము మూడు-గోత్రాల విభాగంలోని సైన్యాల్లో నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 1,08,100. వీళ్లు రూబేను మూడు-గోత్రాల విభాగం తర్వాత బయల్దేరాలి.+ 25  “ఉత్తరం వైపున దాను మూడు-⁠గోత్రాల విభాగం తమ గుంపుల్ని* బట్టి డేరాలు వేసుకోవాలి; అమీషదాయి కుమారుడైన అహీయెజెరు+ దాను వంశస్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 26  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 62,700. 27  అతని పక్కన ఆషేరు గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; ఒక్రాను ​కుమారుడైన పగీయేలు+ ఆషేరు వంశస్థులకు ​ప్రధానుడిగా ఉంటాడు. 28  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 41,500. 29  వాళ్ల పక్కన నఫ్తాలి గోత్రంవాళ్లు డేరాలు వేసుకోవాలి; ఏనాను ​కుమారుడైన అహీర+ నఫ్తాలి వంశ​స్థులకు ప్రధానుడిగా ఉంటాడు. 30  అతని సైన్యంలో నమోదైనవాళ్ల సంఖ్య 53,400. 31  “దాను మూడు-గోత్రాల విభాగంలో నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 1,57,600. తమ ​మూడు-గోత్రాల విభాగం ప్రకారం వీళ్లు అందరికన్నా చివర బయల్దేరాలి.”+ 32  వీళ్లు తమతమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదైన ఇశ్రాయేలీయులు; మూడు-గోత్రాల విభాగాలన్నిట్లో నుండి సైన్యం కోసం నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 6,03,550.+ 33  అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, లేవీయుల్ని మాత్రం మిగతా ఇశ్రాయేలీయులతో పాటు నమోదు చేయలేదు.+ 34  యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రతీది ఇశ్రాయేలీయులు చేశారు. ఇలా వాళ్లు తమతమ మూడు-గోత్రాల విభాగాల్ని బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి డేరాలు వేసుకునేవాళ్లు;+ అదే క్రమంలో బయల్దేరేవాళ్లు.+

అధస్సూచీలు

లేదా “చిహ్నం.”
లేదా “అభిముఖంగా.”
అక్ష., “సైన్యాల్ని.”
అక్ష., “సైన్యాల్ని.”
అక్ష., “సైన్యాల్ని.”
అక్ష., “సైన్యాల్ని.”