సంఖ్యాకాండం 1:1-54
1 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు* దేశం నుండి బయటికి వచ్చిన రెండో సంవత్సరం, రెండో నెల మొదటి రోజున+ సీనాయి ఎడారిలోని* ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడాడు.+ ఆయనిలా చెప్పాడు:
2 “ఇశ్రాయేలీయుల* సమాజమంతటిలో వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాల్ని బట్టి, పురుషులందరి పేర్ల లెక్కను బట్టి నువ్వు జనాభా లెక్క సేకరించు.+
3 నువ్వు, అహరోను కలిసి 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి+ ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలిగే వాళ్లందరి పేర్లను వాళ్లవాళ్ల గుంపుల* ప్రకారం నమోదు చేయాలి.
4 “మీతోపాటు ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తిని తీసుకోండి; ప్రతీ వ్యక్తి తన పూర్వీకుల కుటుంబానికి పెద్ద అయ్యుండాలి.+
5 మీకు సహాయం చేసేవాళ్ల పేర్లు ఏవంటే: రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
6 షిమ్యోను గోత్రంలో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;+
7 యూదా గోత్రంలో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;+
8 ఇశ్శాఖారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు;+
9 జెబూలూను గోత్రంలో హేలోను కుమారుడైన ఏలీయాబు;+
10 యోసేపు కుమారుల్లో: ఎఫ్రాయిము+ గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;
11 బెన్యామీను గోత్రంలో గిద్యోనీ కుమారుడైన అబీదాను;+
12 దాను గోత్రంలో అమీషదాయి కుమారుడైన అహీయెజెరు;+
13 ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు;+
14 గాదు గోత్రంలో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;+
15 నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీర.+
16 సమాజంలో నుండి పిలవబడింది వీళ్లే. వీళ్లు తమ తండ్రుల గోత్రాల్లో ప్రధానులు,+ ఇశ్రాయేలులో వేలమందికి పెద్దలు.”+
17 కాబట్టి మోషే అహరోనులు, దేవుడు పేరు చెప్పి ఎంచుకున్న వీళ్లను తీసుకున్నారు.
18 వాళ్లు రెండో నెల మొదటి రోజున సమాజమంతటినీ సమావేశపర్చారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న పురుషులందర్నీ, వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేయడం కోసం అలా సమావేశపర్చారు.
19 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు. అలా అతను సీనాయి ఎడారిలో వాళ్ల పేర్లను నమోదు చేశాడు.+
20 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ ఒక్కొక్కరిగా లెక్కపెట్టారు;
21 రూబేను గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 46,500.
22 షిమ్యోను వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ ఒక్కొక్కరిగా లెక్కపెట్టారు;
23 షిమ్యోను గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 59,300.
24 గాదు వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
25 గాదు గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 45,650.
26 యూదా వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
27 యూదా గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 74,600.
28 ఇశ్శాఖారు వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
29 ఇశ్శాఖారు గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 54,400.
30 జెబూలూను వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
31 జెబూలూను గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 57,400.
32 ఎఫ్రాయిము ద్వారా వచ్చిన యోసేపు వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
33 ఎఫ్రాయిము గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 40,500.
34 మనష్షే వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
35 మనష్షే గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 32,200.
36 బెన్యామీను వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
37 బెన్యామీను గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 35,400.
38 దాను వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
39 దాను గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 62,700.
40 ఆషేరు వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
41 ఆషేరు గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 41,500.
42 నఫ్తాలి వంశస్థుల్ని+ వాళ్లవాళ్ల పేర్లను బట్టి, వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి సైన్యంలో సేవ చేయగలిగే పురుషులందర్నీ లెక్కపెట్టారు;
43 నఫ్తాలి గోత్రంలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 53,400.
44 మోషే అహరోనుతో, అలాగే తమతమ పూర్వీకుల కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది ప్రధానులతో కలిసి వీళ్ల పేర్లను నమోదు చేశాడు.
45 అలా 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలిగే ఇశ్రాయేలీయులందరి పేర్లు వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదు చేయబడ్డాయి;
46 అలా నమోదు చేయబడిన వాళ్ల మొత్తం సంఖ్య 6,03,550.+
47 అయితే లేవీయుల్ని+ మాత్రం తమ తండ్రుల గోత్రం ప్రకారం వాళ్లతో పాటు నమోదు చేయలేదు.+
48 అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు:
49 “లేవి గోత్రాన్ని మాత్రం నువ్వు నమోదు చేయకూడదు, వాళ్ల సంఖ్యను మిగతా ఇశ్రాయేలీయుల సంఖ్యతో కలపకూడదు.+
50 నువ్వు లేవీయుల్ని సాక్ష్యపు గుడారం మీద, దాని పాత్రలన్నిటి మీద, దానికి చెందిన ప్రతీదాని మీద నియమించాలి.+ వాళ్లు గుడారాన్ని, దాని పాత్రలన్నిటినీ మోస్తారు,+ దాని దగ్గర సేవ చేస్తారు;+ వాళ్లు తమ డేరాల్ని గుడారం చుట్టూ వేసుకోవాలి.+
51 గుడారాన్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి తీసుకెళ్లాలంటే, లేవీయులే దాన్ని ఊడదీయాలి;+ గుడారాన్ని మళ్లీ ఇంకో చోట నిలబెట్టాలంటే, అది కూడా లేవీయులే చేయాలి; వేరేవాళ్లు* ఎవరైనా దాని దగ్గరికి వస్తే, వాళ్లను చంపేయాలి.+
52 “ప్రతీ ఇశ్రాయేలీయుడు తనకు నియమించబడిన చోట తన డేరా వేసుకోవాలి, ప్రతీ ఒక్కరు తమతమ గుంపుల్ని* బట్టి, తమ మూడు-గోత్రాల విభాగం* ప్రకారం తమ డేరా వేసుకోవాలి.
53 లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ తమ డేరాలు వేసుకోవాలి; ఇశ్రాయేలీయుల సమాజం మీద నా కోపం రగులుకోకుండా ఉండేలా వాళ్లు అలా చేయాలి.+ సాక్ష్యపు గుడారాన్ని చూసుకునే* బాధ్యత లేవీయులదే.”+
54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినవన్నీ ఇశ్రాయేలు ప్రజలు చేశారు. వాళ్లు సరిగ్గా అలాగే చేశారు.
అధస్సూచీలు
^ లేదా “ఈజిప్టు.”
^ అక్ష., “ఇశ్రాయేలు కుమారుల.”
^ అక్ష., “సైన్యాల.”
^ లేదా “అపరిచితులు,” అంటే లేవీయులుకాని వాళ్లు.
^ అక్ష., “సైన్యాల్ని.”
^ లేదా “ధ్వజం.”
^ లేదా “కాపలాకాసే; దాని దగ్గర తమ సేవ చేసే.”