యోబు 35:1-16

  • యోబు వాదన తప్పు అని ఎలీహు అన్నాడు (1-16)

    • తాను దేవుని కన్నా నీతిమంతుణ్ణి అని యోబు అన్నాడు (2)

    • దేవుడు ఎత్తులో ఉంటాడు, పాపం ఆయన మీద ప్రభావం చూపించదు (5, 6)

    • యోబు దేవుని కోసం వేచివుండాలి (14)

35  ఎలీహు ఇంకా ఇలా అన్నాడు:  2  “నువ్వు నిర్దోషివని నీకు అంత నమ్మకమా?‘నేను దేవుని కన్నా నీతిమంతుణ్ణి’ అని అంటావా?+  3  ఎందుకంటే నువ్వు, ‘నేను నీతిగా ఉండడం వల్ల నీకేం* ఉపయోగం? నేను పాపం చేయకుండా ఉండడం వల్ల నాకేమైనా మేలు జరిగిందా?’ అని అంటున్నావు.+  4  నేను నీకూ, నీతో ఉన్న నీ సహచరులకూ+ జవాబిస్తాను.  5  ఆకాశం వైపు తల ఎత్తి చూడు,ఎంతో ఎత్తులో ఉన్న మేఘాల్ని గమనించు.  6  నువ్వు పాపం చేస్తే, ఆయనకేం నష్టం?+ నీ అపరాధాలు ఎక్కువైతే, ఆయనకేం బాధ?+  7  నువ్వు నీతిగా ఉంటే, ఆయనకు వచ్చేదేంటి? నీ నుండి ఆయన తీసుకునేదేంటి?+  8  నీ చెడుతనం వల్ల నీలాంటి మనుషులకే నష్టం,నీ నీతి వల్ల మనుషులకే ప్రయోజనం.  9  తీవ్రంగా బాధించబడినప్పుడు ప్రజలు మొరపెడతారు;శక్తిమంతుల అణచివేత* నుండి కాపాడమని వేడుకుంటారు.+ 10  కానీ, ‘దేవుడు ఎక్కడ? నా మహాగొప్ప రూపకర్త ఎక్కడ?+రాత్రివేళ పాటలు పాడేలా చేసే దేవుడు+ ఎక్కడ?’ అని ఎవ్వరూ అనరు. 11  ఆయన, జంతువుల కన్నా మనకే ఎక్కువ బోధిస్తున్నాడు;+ఆకాశపక్షుల కన్నా మనకే ఎక్కువ తెలివిని ఇస్తున్నాడు. 12  ప్రజలు మొరపెడుతున్నారు,కానీ దుష్టుల గర్వాన్ని బట్టి+ ఆయన జవాబివ్వట్లేదు.+ 13  నిజంగా, దేవుడు వ్యర్థమైన మొరను* వినడు;+సర్వశక్తిమంతుడు దాన్ని పట్టించుకోడు. 14  అలాంటప్పుడు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదని అంటున్న+ నీ మొరను ఎలా వింటాడు? నీ వ్యాజ్యం ఆయన ముందు ఉంది, కాబట్టి నువ్వు ఆత్రంగా ఆయన కోసం వేచివుండాలి.+ 15  ఎందుకంటే, ఆయన కోపంతో నిన్ను లెక్క అడగలేదు;నువ్వు ఆలోచించకుండా మాట్లాడిన మాటల్ని పట్టించుకోలేదు.+ 16  యోబు వ్యర్థంగా తన నోరు పెద్దగా తెరుస్తున్నాడు;జ్ఞానం లేకుండా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు.”+

అధస్సూచీలు

బహుశా దేవుణ్ణి సూచిస్తుంది.
అక్ష., “బాహువు.”
లేదా “అబద్ధాన్ని.”