యోబు 33:1-33

  • యోబు స్వనీతిని బట్టి ఎలీహు ​గద్దించాడు (1-33)

    • విమోచన క్రయధనం దొరికింది (24)

    • యౌవన బలం తిరిగొస్తుంది (25)

33  “యోబూ, దయచేసి నా మాటలు ఆలకించు;నేను చెప్పే ప్రతీది విను.   దయచేసి చూడు! నేను నా నోరు తెరవాలి;నా నాలుక మాట్లాడాలి.   నా మాటలు నా హృదయంలోని నిజాయితీని చూపిస్తాయి,+నా పెదాలు నాకు తెలిసినదాన్ని ఉన్నదున్నట్టు చెప్తాయి.   దేవుని పవిత్రశక్తే* నన్ను తయారుచేసింది,+సర్వశక్తిమంతుని ఊపిరే నాకు జీవాన్నిచ్చింది.+   నువ్వు నాకు జవాబివ్వగలిగితే ఇవ్వు;నీ వాదనల్ని నా ముందు వినిపించు, సిద్ధంగా ఉండు.   చూడు! సత్యదేవుని ముందు నేను కూడా నీలాంటివాణ్ణే;నేను కూడా బంకమట్టి నుండే తయారు చేయబడ్డాను.+   కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ నాకు భయపడాల్సిన అవసరం లేదు,నా మాటలు నిన్ను నలగ్గొట్టవు.   అయితే నువ్వు ఈ మాటలు అనడం నేను విన్నాను,అవును, నువ్వు ఇలా అంటూ ఉన్నావు:   ‘నేను పవిత్రుణ్ణి, నాలో ఏ అపరాధం లేదు;+నేను శుద్ధుణ్ణి, నేను ఏ తప్పూ చేయలేదు.+ 10  అయినా ఎందుకో దేవుడు నన్ను వ్యతిరేకిస్తున్నాడు;నన్ను తన శత్రువులా చూస్తున్నాడు.+ 11  నా పాదాల్ని బొండలో బిగిస్తున్నాడు;నా మార్గాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు.’+ 12  కానీ నువ్వలా అనడం సరికాదు, కాబట్టి నేను నీకు జవాబిస్తాను: దేవుడు మనిషి కన్నా చాలాచాలా గొప్పవాడు.+ 13  నువ్వు ఎందుకు ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నావు?+ నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ ఆయన జవాబు ఇవ్వలేదనా?+ 14  దేవుడు ఒకసారి మాట్లాడతాడు, రెండుసార్లు మాట్లాడతాడు,కానీ ఎవ్వరూ పట్టించుకోరు; 15  కలలో, రాత్రి వచ్చే దర్శనంలో,+ప్రజలు తమ పరుపు మీద పడుకొనిగాఢనిద్రలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. 16  అప్పుడు ఆయన వాళ్ల చెవులు తెరుస్తాడు,+తాను వాళ్లకు ఇచ్చిన ఉపదేశాన్ని ధృవీకరిస్తాడు.* 17  మనిషిని తప్పులు చేయకుండా ఆపడానికి,+గర్వం నుండి అతన్ని కాపాడడానికి ఆయనలా చేస్తాడు.+ 18  దేవుడు అతన్ని* గోతిలోకి* పోకుండా ఆపుతాడు,+ఖడ్గం* వల్ల నశించిపోకుండా అతని ప్రాణాన్ని కాపాడతాడు. 19  ఒకవ్యక్తి నొప్పితో మంచం మీద పడుకున్నప్పుడు,అనుక్షణం తన ఎముకల్లో బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా ఏదోక పాఠం నేర్చుకుంటాడు. 20  ఆ సమయంలో అతను రొట్టెను అసహ్యించుకుంటాడు,చివరికి శ్రేష్ఠమైన ఆహారాన్ని కూడా తిరస్కరిస్తాడు.+ 21  అతను పూర్తిగా బక్కచిక్కిపోతాడు,అతని ఎముకలు బయటికి కనిపిస్తాయి. 22  అతను* గోతికి* దగ్గరౌతాడు;అతని ప్రాణం హంతకుల్ని సమీపిస్తుంది. 23  అయితే అతనికి ఒక సందేశకుడు* ఉంటే,వెయ్యిమందిలో అతని పక్షాన వాదించేవాడు ఒకడు ఉండిఏది సరైనదో అతనికి చెప్తే, 24  దేవుడు అతని మీద దయ చూపించి, ఇలా అంటాడు:‘గోతిలోకి*+ వెళ్లకుండా అతన్ని ఆపండి! అతని కోసం నాకు విమోచన క్రయధనం*+ దొరికింది! 25  అతని శరీరం* పిల్లల శరీరం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది;+అతనికి తన యౌవన బలం తిరిగొస్తుంది.’+ 26  అతను దేవునికి ప్రార్థిస్తాడు,+ ఆయన అతన్ని అంగీకరిస్తాడు,అతను సంతోషంతో కేకలు వేస్తూ ఆయన ముఖం చూస్తాడు,అతను మళ్లీ తన దృష్టిలో నీతిమంతునిగా ఉండేలా చేస్తాడు. 27  అప్పుడు ఆ వ్యక్తి మనుషులకు ఇలా ప్రకటిస్తాడు:*‘నేను పాపం చేశాను,+ సరైనదాన్ని వక్రీకరించాను,కానీ నాకు తగిన శిక్ష పడలేదు.* 28  ఆయన నా ప్రాణాన్ని గోతిలోకి* వెళ్లకుండా కాపాడాడు,+నేను* వెలుగును చూస్తాను.’ 29  దేవుడు మనిషి విషయంలో రెండుసార్లు, మూడుసార్లు ఇవన్నీ చేస్తాడు; 30  అలా అతన్ని గోతి* నుండి వెనక్కి తీసుకొస్తాడు,అప్పుడతను జీవపు వెలుగును ఆనందిస్తాడు.+ 31  యోబూ, నా మాటల్ని విను! శ్రద్ధగా ఆలకించు! మౌనంగా ఉండు, నేను ఇంకా మాట్లాడతాను. 32  నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే, నాతో చెప్పు. మాట్లాడు, ఎందుకంటే నువ్వు నిర్దోషివని నేను రుజువు చేయాలనుకుంటున్నాను. 33  చెప్పడానికి ఏమీ లేకపోతే, నేను చెప్పేది విను;మౌనంగా ఉండు, నేను నీకు తెలివిని బోధిస్తాను.”

అధస్సూచీలు

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “ముద్ర వేస్తాడు.”
లేదా “ఆయుధం (విసిరే ఆయుధం).”
లేదా “సమాధిలోకి.”
లేదా “అతని ప్రాణాన్ని.”
లేదా “అతని ప్రాణం.”
లేదా “సమాధికి.”
లేదా “దేవదూత.”
లేదా “సమాధిలోకి.”
పదకోశం చూడండి.
అక్ష., “మాంసం.”
అక్ష., “పాడతాడు.”
లేదా “దానివల్ల నాకు వచ్చిందేమీ లేదు” అయ్యుంటుంది.
లేదా “సమాధిలోకి.”
లేదా “నా ప్రాణం.”
లేదా “సమాధి.”